Google Instrument: గూగుల్ సెర్చ్‌తో గిటార్‌ ట్యూనింగ్..!
close

Published : 10/10/2021 22:35 IST

Google Instrument: గూగుల్ సెర్చ్‌తో గిటార్‌ ట్యూనింగ్..!

ఇంటర్నెట్‌డెస్క్‌: సంగీత ప్రియుల కోసం గూగుల్ సరికొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. గూగుల్ ట్యూనర్‌ లేదా ఇన్‌స్ట్రుమెంట్ ట్యూనర్‌ పేరుతో ఈ ఫీచర్‌ని తీసుకొచ్చింది. దీని సాయంతో యూజర్స్‌ తమ గిటార్‌ని ట్యూన్ చేసుకోవచ్చు. యాప్‌స్టోర్లో ఉండే ట్యూనింగ్ యాప్స్‌ తరహాలోనే గూగుల్ ఇన్‌స్ట్రుమెంట్ ట్యూనర్ పనిచేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ యూజర్స్‌ అందరికీ అందుబాటులో ఉంది. గూగుల్ సెర్చ్‌లో గూగుల్ ట్యూనర్‌ అని టైప్‌ చేస్తే ఇన్‌స్ట్రుమెంట్‌ ట్యూనర్ పేరుతో పేజ్ కనిపిస్తుంది. అందులో మైక్రోఫోన్‌పై క్లిక్ చేసి యూజర్స్ తమ గిటార్‌ని ప్లే చేస్తే గూగుల్ ట్యూనర్‌ ఆ సౌండ్‌కి తగినట్లుగా సూచనలు చేస్తుంది. అయితే ఈ ఫీచర్‌ను ఉపయోగించుకునేందుకు యూజర్స్‌ గూగుల్‌కి తమ కంప్యూటర్ల నుంచి మైక్రోఫోన్‌ అనుమతి ఇవ్వాలి.

మరోవైపు కొద్దిరోజుల క్రితం గూగుల్ కొత్త ఫీచర్స్‌తో క్రోమ్‌ 94 అప్‌డేట్‌ని విడుదల చేసింది. వీటిలో సెక్యూరిటీ ఫీచర్స్‌తోపాటు కొన్ని లోపాలను సరిచేసినట్లు తెలిపింది. అలానే గూగుల్ మ్యాప్స్‌లో ఎకో-ఫ్రెండ్లీ రూటింగ్, సైకిలింగ్ చేసే వారికి నావిగేషన్‌, బైక్‌, స్కూటర్స్‌ సమాచారానికి సంబంధించిన ఫీచర్స్‌ని తీసుకొచ్చింది. వాటితోపాటు జీమెయిల్‌, ఆండ్రాయిడ్‌లలో కొత్త సెర్చ్‌ ఫిల్టర్స్‌ని కూడా పరిచయం చేసింది. వీటితో యూజర్స్‌ తమ మొబైల్ డివైజ్‌లలో జీమెయిల్‌ సెర్చ్‌ని సులువుగా చేయొచ్చు. ఈ సెర్చ్‌ ఫిల్టర్‌ జీమెయిల్‌ యాప్‌లో సెర్చ్‌ బాక్స్‌ కింద ఉంటుంది. అలానే దీని సాయంతో యూజర్స్‌ తమ నచ్చినట్లుగా సెర్చ్‌ రిజల్ట్‌లో మార్పులు చేయొచ్చు.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న