ఇన్‌స్టాలో కంటెంట్‌ని పట్టేద్దామిలా!
close

Updated : 06/07/2021 16:08 IST
ఇన్‌స్టాలో కంటెంట్‌ని పట్టేద్దామిలా!

ఇన్‌స్టాగ్రామ్‌ అంటేనే జిగేల్‌మనే ఫొటోలు.. నిడివి తక్కువ ఉన్న వీడియోలు.. ఆకర్షణీయమైన స్టోరీలు. మన ప్రతిభను ప్రపంచం ముందు ఉంచడానికి ఈ మాధ్యమం ఓ చక్కని వేదిక. కానీ, వీటిని డౌన్‌లోడ్‌ చేసుకునే ఆప్షనే ఉండదు. అందుకో మార్గం ఉంది. ఇదిగో ఇలా చేసి చూడండి. మీకు కావాల్సినవవి ఏవైనా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్‌లో..

* ముందు ఈ లింక్‌ మీద క్లిక్‌ చేయాలి.

* డౌన్‌లోడ్‌ చేయాలనుకున్న స్టోరీలను ప్రొఫైల్‌ పేరుతో సెర్చ్‌ చేయాలి.

* ఇప్పుడు వచ్చిన స్టోరీ లింక్‌ని కాపీ చేసుకొని వెనక్కి రావాలి.

* మొదటి స్టెప్‌లోకి రాగానే లింక్‌ని పేస్ట్‌ చేయగానే డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది.

* డౌన్‌లోడ్‌పై క్లిక్‌ చేయగానే స్టోరీ సేవ్‌ అవుతుంది. స్క్రీన్‌ మీద నోటిఫికేషన్‌ కనిపిస్తుంది.

పీసీలో...

* ఏ స్టోరీ డౌన్‌లోడ్‌ చేయాలి అనుకుంటున్నామో ఆ ఇన్‌స్టా ఖాతాను సెర్చ్‌ చేయాలి.

లింక్‌ సాయంతో తెరవాలి.

* యూజర్‌ నేమ్‌ లేదా ఖాతా యూఆర్‌ఎల్‌ని ఇన్‌పుట్‌ బాక్స్‌లో పేస్ట్‌ చేయాలి.

* డౌన్‌లోడ్‌ ఫొటో, వీడియో, స్టోరీస్‌.. విభాగాలు కనిపిస్తుంటాయి.

* ఏది కావాలంటే దానిపై క్లిక్‌ చేస్తే చాలు. కంప్యూటర్‌ తెరపై డౌన్‌లోడ్లు కనిపిస్తుంటాయి.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న