Instagram Favourites: ‘ఫేవరేట్స్‌’ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫీచర్‌
close

Published : 14/09/2021 23:00 IST
Instagram Favourites: ‘ఫేవరేట్స్‌’ కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఫీచర్‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమం ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల కోసం ఫీచర్లను అప్‌డేట్‌ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మరో ఫీచర్‌పై మీద టెస్టింగ్‌ నిర్వహిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్‌కు ఎవరైనా ప్రొఫైల్‌ నచ్చితే వారిని ఫేవరేటీస్‌గా మార్క్‌ చేయొచ్చు. స్నేహితులు, క్రియేటర్స్‌ ఖాతాల్లోని అతి ముఖ్యమైన వారిని విభాగాలుగా విభజించే అవకాశం యూజర్లకు కలుగుతుంది. ‘ఫేవరేట్స్‌’ జాబితాలో ఉండే వారు పెట్టే పోస్టులు యూజర్‌ ఫీడ్‌లో అధిక ప్రాధాన్యత కలిగి ఉంటాయి. అయితే ఇంత వరకు ఇన్‌స్టాగ్రామ్‌ నుంచి దీని మీద అధికారికంగా ప్రకటన రాలేదు. 2017లోనూ ఇలానే ఇన్‌స్టాగ్రామ్‌ డిఫరెంట్‌ ఫేవరేట్స్‌ ఫీచర్‌ మీద టెస్టింగ్‌ నిర్వహించింది. ప్రతి పోస్ట్‌కు ఆడియన్స్‌ సంఖ్యను పరిమితం చేసేలా అప్పుడు యూజర్‌కు అవకాశం కల్పించింది. 

అలానే పుట్టిన తేదీ(డేట్‌ ఆప్‌ బర్త్‌)ని ప్రతి యూజర్‌ తప్పకుండా ధ్రువీకరించాలని ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. భద్రతకు సంబంధించిన కొత్త నిబంధనల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫేస్‌బుక్ వెల్లడించింది. ‘‘ ప్రతి ఇన్‌స్టా యూజర్‌ తమ పుట్టిన తేదీని ధ్రువీకరించాలి. దానివల్ల మేం ఆయా వయస్సుల వారికి అందుకనుగుణంగా సేవలను అందించగలుగుతాం’’ అని తన బ్లాగ్‌లో పేర్కొంది. 16 ఏళ్లు దాటిన వారు ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రైవేటు ఖాతా తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు వెల్లడించింది. అందుకనుగుణంగా యూజర్స్ ఇన్‌స్టాలో ఖాతా తెరిచేటప్పుడు తప్పనిసరిగా తమ పుట్టిన తేదీని సమర్పించాలని కోరింది. ఒకవేళ యూజర్‌ పుట్టిన తేదీని ధ్రువీకరించకుంటే పాప్‌-నోటిఫికేషన్‌ ద్వారా సదరు యూజర్‌కి గుర్తు చేస్తుంటామని.. అప్పటికీ చేయకపోతే ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ సేవలను నిలిపివేస్తామని ఫేస్‌బుక్ తెలిపింది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న