ఐఫోన్‌ 12 తరహాలోనే ఐఫోన్‌ 13 ఉంటుందా..?
close

Published : 04/11/2020 22:53 IST
ఐఫోన్‌ 12 తరహాలోనే ఐఫోన్‌ 13 ఉంటుందా..?

వచ్చే ఏడాదిలో విడుదల చేసేందుకు యాపిల్‌ సమాయత్తం

ఇంటర్నెట్‌ డెస్క్: వచ్చే ఏడాది ఐఫోన్‌ 13 సిరీస్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు యాపిల్‌ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు టెక్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవలే విపణిలోకి ఐఫోన్‌ 12 సిరీస్‌ ఫోన్లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్‌ 12 ఫోన్ల మాదిరిగా ఐఫోన్‌ 13 సిరీస్‌ ఫోన్లు ఉండే అవకాశం ఉందని సామాజిక మాధ్యమాల్లో వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని యాపిల్‌ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఐఫోన్‌ 12 సిరీస్‌ ఫోన్లలో యూఎస్‌బీ కేబుల్‌, టచ్‌ ఐడీని ఇవ్వలేదు. త్వరలో రాబోయే ఐఫోన్‌ 13 సిరీస్‌లోనూ ఇదే విధంగా ఉండొచ్చని అంచనా. అయితే ఫీచర్స్‌ పరంగా మరిన్ని అప్‌డేట్స్‌ ఉండే అవకాశం ఉంది. 

‘ఐఫోన్‌ 12లో లేని టచ్‌ డిస్‌ప్లే ఐడీని ఐఫోన్‌ 13 ఫోన్‌లోనైనా వస్తుందేమోనని వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. అయితే డిస్‌ప్లే టచ్‌ ఐడీని కూడా ప్రోటోటైప్‌లో చేర్చలేదని తెలుస్తోంది’ అని టిప్‌స్టర్‌ జియోరికొ ట్విటర్‌లో పేర్కొన్నారు. కనీసం డిస్‌ప్లే టచ్‌ ఐడీతో ఒక మోడల్‌ను విడుదల చేయనున్నట్లు గతంలో యాపిల్‌ నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇంతవరకు అలాంటి మోడల్‌ రాకపోవడం గమనార్హం. ఐప్యాడ్‌ ప్రొ డిజైన్‌ను ఐఫోన్ 13కు అవలంభిస్తున్నట్లు జియోరికొ ట్వీట్‌నుబట్టి తెలుస్తోంది. ఐఫోన్‌ 13 సిరీస్‌ 120Hz స్క్రీన్‌ రిఫ్రెష్‌ రేట్‌ సామర్థ్యంతో, ఎల్‌పీవో డిస్‌ప్లేను డిజైన్‌ చేస్తున్నట్లు టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు 1TB స్టోరేజీతో ఐఫోన్‌ 13 రాబోతున్నట్లు టిప్‌స్టర్‌ జాన్‌ ప్రోసర్‌ వెల్లడించారు. ఐఫోన్ 13 ప్రారంభ ధర దాదాపు రూ.89,900 నుంచి ఉండొచ్చని అంచనా.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న