WhatsApp: చాటింగ్‌తో షాపింగ్‌ చేసేలా..!
close

Updated : 25/10/2020 20:17 IST
WhatsApp: చాటింగ్‌తో షాపింగ్‌ చేసేలా..!

త్వరలో యూజర్ల కోసం అందుబాటులోకి..

ఇంటర్నెట్‌ డెస్క్‌: వినియోగదారుల కోసం వాట్సాప్‌ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతోంది. ప్రస్తుత కాలంలో అంతా ఆన్‌లైన్‌లోనే షాపింగ్‌ చేసేవాళ్లు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రమంలో వాట్సాప్‌ తన వినియోగదారుల కోసం ‘చాట్‌ షాపింగ్‌’ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఉత్పత్తుల జాబితా చూసుకోవడం, వస్తువులను ఆర్డర్ చేయడం, పేమెంట్‌, చెక్‌ ఔట్‌ వంటివన్నీ ‘వాట్సప్‌ చాట్’‌ ద్వారానే చేసుకునే వెసులుబాటు కల్పించనుంది. వాట్సప్‌ బ్లాగ్‌ పోస్ట్‌ను బట్టి ఒక్క యాప్‌తోనే వ్యాపారం నిర్వహించుకునేలా కొత్త ఫీచర్స్‌ను తీసుకురాబోతుందని తెలుస్తోంది. చాట్‌ షాపింగ్‌ గురించి వాట్సాప్‌ తన బ్లాగ్‌లో క్లుప్తంగా చెప్పుకొచ్చింది. అందుబాటులో ఉన్న ఉత్పత్తులను చెక్ చేయడానికి, చాటింగ్‌ ద్వారా కొనుగోళ్లు చేసేందుకు అనువైన వేదికగా వాట్సాప్‌ యాప్‌ను విస్తరించబోతున్నట్లు పేర్కొంది. ఓఎల్‌ఎక్స్‌, క్వికర్‌, ఈ-బే వెబ్‌సైట్లలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండానే చాటింగ్‌ ద్వారా సురక్షితంగా కొనుగోళ్లు జరపవచ్చని వాట్సాప్‌ చెబుతోంది. దీనికి సంబంధించిన వీడియోను విడుదల చేసింది. అయితే ఈ ఫీచర్‌ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వాట్సాప్‌ వెల్లడించలేదు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న