Windows 11: పాత కంప్యూటర్లలో విండోస్‌ 11 అప్‌డేట్‌లపై మైక్రోసాఫ్ట్ ఏమందంటే..!
close

Published : 30/08/2021 23:00 IST
Windows 11: పాత కంప్యూటర్లలో విండోస్‌ 11 అప్‌డేట్‌లపై మైక్రోసాఫ్ట్ ఏమందంటే..!

ఇంటర్నెట్‌డెస్క్‌: పాత కంప్యూటర్లలో విండోస్ 11 ఉపయోగించాలంటే కొన్ని ప్రత్యేక ఫీచర్లు ఉండాలని మైక్రోసాఫ్ట్ షరతు విధించింది. అయితే దీనిపై యూజర్స్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తర్వాత పాత కంప్యూటర్లలో కూడా ఐఎస్‌వో ఫైల్‌ ద్వారా విండోస్‌ 11ని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చని మైక్రోసాఫ్ట్ తెలిపింది. అయితే, 1గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌ 64 బిట్ ఆపరేటింగ్ సిస్టం ఉండి 4జీబీ ర్యామ్‌/64జీబీ ఆపై స్టోరేజ్‌ సామర్థ్యం కలిగి ఉండాలని తెలిపింది. దాంతోపాటు ఇంటెల్‌ కోర్ ఎక్స్‌ సిరీస్‌, ఎక్సాన్‌ డబ్ల్యూ సిరీస్‌తో పాటు ఇంటెల్‌ కోర్ 7820 హెచ్‌క్యూ ప్రాసెసర్లు సపోర్ట్‌ చేస్తుందని పేర్కొంది. దీంతో తమ కంపూర్లలో ఈ ఫీచర్స్‌ ఉన్న యూజర్స్ విండోస్ 11ని ఇన్‌స్టాల్ చేసుకున్నారు. తాజాగా దీనిపై మైక్రోసాఫ్ట్‌ మరో ప్రకటన చేసింది. ఐఎస్‌ఓ ఫైల్ ద్వారా విండోస్ 11 ఇన్‌స్టాల్ చేసుకున్న యూజర్స్‌కి భద్రతాపరమైన అప్‌డేట్‌లతో పాటు ఇతర అప్‌డేట్‌లు రావని తెలిపింది.

ఈ ప్రకటనతో యూజర్స్‌లో కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడింది. దీనిపై మైక్రోసాఫ్ట్ ఓఎస్‌ సెక్యూరిటీ డైరెక్టర్ డేవిడ్ వెస్టన్ వివరణ ఇచ్చారు. ‘‘ట్రస్టెడ్‌ ఫ్లాట్‌ఫాం మాడ్యుల్‌ (టీపీఎమ్‌) లేని కంప్యూటర్లకు ఆటోమేటిక్‌గా వచ్చే అప్‌డేట్‌లు మాత్రమే రావు. టీపీఎమ్ చిప్‌ మీ కంప్యూర్లతో పాటు రాకున్నా దాన్ని మీరు తర్వాత ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఎన్‌క్రిప్షన్ కీలను, యూజర్‌కి సంబంధించిన సమాచారాన్ని భద్రంగా ఉంచేందుకు టీపీఎమ్‌ చిప్ ఉపయోగపడుతుంది. మాల్‌వేర్‌, సైబర్‌ దాడుల నుంచి కంప్యూటర్లను కాపాడుతుంది. అందుకోసమే టీపీఎమ్‌ చిప్‌లు లేని కంప్యూటర్లలో కొత్త అప్‌డేట్‌లు ఇవ్వడంలేదు’’ అని తెలిపారు. అయితే ఈ టీపీఎమ్ చిప్‌లు ఇంటెల్ 8 జనరేషన్ ప్రాసెసర్లు ఉన్న కంప్యూటర్లలోనే ఉన్నట్లు టెక్‌ నిపుణులు తెలిపారు. మరి ఐఎస్‌ఓ ఫైల్స్‌ ద్వారా కొత్త విండోస్‌ 11 అప్‌డేట్‌లను డౌన్‌లోడ్ చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్ అనుమతిస్తుందా? లేదా? అనేది తెలియాల్సివుంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న