స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ షురూ అయింది..
close

Published : 03/12/2020 09:33 IST
స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ షురూ అయింది..

తమ ఉత్పత్తులను తీసుకొస్తామంటున్న మొబైల్‌ సంస్థలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌ఫోన్‌ నుంచి కంప్యూటర్‌ వరకు ఏదైనా సరే పనిచేయాలంటే ప్రాసెసర్‌ ఎంతో కీలకం. ఫోన్లలో వినియోగించే ప్రాసెసర్ల రంగంలో క్వాల్‌కామ్‌ అగ్రస్థానంలో ఉంది. 5G మోడెమ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), గ్రాఫిక్స్‌  ప్రాసెసర్‌ యూనిట్ (GPU) అప్‌గ్రేడ్‌ వెర్షన్‌తో స్నాప్‌ డ్రాగన్‌ 888ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో  విడుదల కానున్న పెద్ద సంస్థల స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువ భాగం స్నాప్ డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌తో వచ్చే అవకాశం ఉంది.  ఆసుస్, లెనోవా, ఎల్జీ, మోటరోలా, రియల్‌మీ, వన్‌ప్లస్‌, ఒప్పో, జియోమీ వంటి కంపెనీలు తమ నూతన ఉత్పత్తుల్లో స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ను వినియోగించుకోనున్నాయని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. స్నాప్‌ డ్రాగన్‌ 865+ ప్రాసెసర్‌కు అడ్వాన్స్‌డ్‌గా స్నాప్‌డ్రాగన్ 888 రానుంది. గేమింగ్‌ను లక్ష్యంగా చేసుకుని GPU 144 ఎఫ్‌పీఎస్‌ అప్‌గ్రేడ్‌తో స్నాప్‌డ్రాగన్‌ 888ను తయారు చేసినట్లు క్వాల్‌కోమ్‌ సంస్థ పేర్కొంది.

మేం ముందు ఉంటాం: వన్‌ప్లస్‌

గత జనరేషన్ ప్రాసెసర్ల కంటే స్పాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ 35 శాతం వేగవంతమైనదిగా క్వాల్‌కోమ్ తెలిపింది. ఇప్పటికే జియోమీ, వన్‌ ప్లస్‌, రెడ్‌మీ తమ సంస్థల నుంచి కొత్త ప్రాసెసర్‌తో ఫోన్లు తీసుకొస్తున్నట్లు ప్రకటించాయి. అదే విధంగా 2021 తొలి అర్ధభాగంలో స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌తో స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు వన్‌ప్లస్ వెల్లడిచింది. ‘5G, గేమ్స్‌, కెమెరా పనితీరు వంటి అంశాలలో సాంకేతికత ఆవిష్కరణలను ఒడిసిపట్టుకోవడంలో వన్‌ప్లస్‌ ముందుంటుంది. వచ్చే ఏడాది మొదటి అర్ధ భాగంలో తీసుకురాబోయే హైఎండ్‌ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌ను వినియోగించబోతున్నాం’ అని సంస్థకు చెందిన ఓ ఎగ్జిక్యూటివ్‌ పేర్కొన్నారు. వన్‌ప్లస్‌ 9, వన్‌ప్లస్‌ 9 ప్రొ మోడళ్లను విడుదల చేయవచ్చేమోనని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

మాదే తొలి ఫోన్‌: రియల్‌మీ

తమ సంస్థ నుంచి వచ్చే Mi11 స్మార్ట్‌ఫోనే స్నాప్‌డ్రాగన్‌ 888 ప్రాసెసర్‌తో రాబోయే తొలి ఫోన్‌ అని జియోమీ సీఈవో లీ జున్‌ వెల్లడించారు. అయితే ఆ ప్రాసెసర్‌తో విడుదలయ్యే మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ తమదేనని రియల్‌మీ చెబుతోంది. ‘రేస్‌’ (ఇంకా అధికారికంగా నిర్థారించలేదు) స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 888 చిప్‌నే వాడుతామని రియల్‌మీ స్పష్టం చేసింది. ‘సంస్థకు, యూజర్లకు ఇదొక మైలురాయి. అంతర్జాతీయంగా ఉన్న వినియోగదారుల కోసం 5G టెక్నాలజీతో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తాం.  2021లో భారత్‌లోకి అత్యాధునిక టెక్నాలజీతో ఎక్కువ ఉత్పత్తులను తీసుకురావాలని భావిస్తున్నాం’ అని రియల్‌మీ వైస్‌ ప్రెసిడెంట్‌ మాధవ్‌ సేథ్‌ తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న