Samsung Cloud: నిలిచిపోనున్న శాంసంగ్ క్లౌడ్‌ సేవలు..యూజర్స్‌కి కీలక సూచన!
close

Published : 30/08/2021 09:18 IST
Samsung Cloud: నిలిచిపోనున్న శాంసంగ్ క్లౌడ్‌ సేవలు..యూజర్స్‌కి కీలక సూచన!

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాంసంగ్‌ క్లౌడ్‌ యూజర్స్‌కి ఆ సంస్థ కీలక సూచన చేసింది. సెప్టెంబరు 30 తేదీలోగా శాంసంగ్ క్లౌడ్ స్టోరేజ్‌ సేవలు ఉపయోగించుకుంటున్న యూజర్స్ తమ డేటాను డౌన్‌లోడ్ చేసుకుని మరొక చోట సేవ్‌ చేసుకోవాలని కోరింది. సెప్టెంబరు తర్వాత శాంసంగ్‌ క్లౌడ్ సేవలు అందుబాటులో ఉండవని తెలిపింది. దీనికి సంబంధించి ఇప్పటికే పలువురు యూజర్స్‌కి శాంసంగ్‌ మెయిల్స్ ద్వారా సమాచారం అందించింది. శాంసంగ్ మొబైల్ యూజర్స్‌ తమ ఫోన్లలోని కాంటాక్ట్స్‌, క్యాలెండర్‌ వంటి వాటితోపాటు ఫోన్ గ్యాలరీలోని ఫొటోలను స్టోర్ చేసుకునేందుకు శాంసంగ్ క్లౌడ్ స్టోరేజ్‌ సేవలను అందిస్తోంది. తాజా నిర్ణయంతో ఇప్పటి వరకూ శాంసంగ్‌ క్లౌడ్‌లో స్టోర్ చేసుకున్న తమ డేటాను యూజర్స్ డౌన్‌లోడ్ చేసుకుని మరో చోట సేవ్ చేయడం లేదా ఇంకొక చోటుకి బదిలీ చేయక తప్పదు. 

కొంతమంది యూజర్స్ తమ శాంసంగ్‌ ఫోన్లలో మై ఫైల్స్‌ ఓపెన్ చేస్తే శాంసంగ్ క్లౌడ్ డేటాను మైక్రోసాఫ్ట్‌ వన్‌డ్రైవ్‌లోకి మార్చుకోవాలని సూచిస్తున్నట్లు తెలిపారు. అయితే శాంసంగ్ క్లౌడ్‌ స్టోరేజ్‌లోని డేటాను యూజర్స్ డౌన్‌లోడ్ చేసుకునేందుకు సెప్టెంబరు 30 వరకూ గడువు విధించింది. దాంతోపాటు క్లౌడ్ సేవలను సబ్‌స్క్రైబ్ చేసుకున్న యూజర్స్‌కి నగదు తిరిగి చెల్లించనున్నట్లు తెలిపింది. అలానే శాంసంగ్ క్లౌడ్ యూజర్స్‌ని రెండు గ్రూపులుగా విభిజించినట్లు వెల్లడించింది. సెప్టెంబరు 30 తర్వాత గ్రూప్‌-1లో ఉన్న యూజర్స్ డేటాను తొలగించనున్నట్లు తెలిపింది. నవంబరు చివరినాటికి గ్రూప్‌-2లోని యూజర్స్ డేటాను డిలీట్ చేయనుంది. అయితే ఏయే దేశాలకు చెందిన యూజర్స్ గ్రూప్‌-1, గ్రూప్-2లో ఉంటారనేది మాత్రం వెల్లడించలేదు. అందుకే సెప్టెంబరు 30లోపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాంసంగ్‌ క్లౌడ్ యూజర్స్ తమ డేటాను మరోచోటుకి బదిలీ చేసుకోమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. 

ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే?

శాంసంగ్‌ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి సెర్చ్‌లో శాంసంగ్‌ క్లౌడ్ అని టైప్‌ చేయాలి. కింద సెర్చ్ రిజల్ట్‌లో శాంసంగ్ క్లౌడ్‌పై క్లిక్‌ చేస్తే అందులో మీకు డౌన్‌లోడ్ మై డేటా, సింక్డ్‌ యాప్స్‌, బ్యాకప్‌ డేటా, రీస్టోర్ డేటా, డిలీట్ బ్యాకప్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో డౌన్‌లోడ్ మై డేటాపై క్లిక్ చేసి మీ ఫొటోలు, ఇతర డేటా డౌన్‌లోడ్ అయ్యే వరకు వేచి చూడాలి. తర్వాత ఆ డేటాను మరోచోటుకి బదిలీ చేసుకుని సేవ్ చేసుకోవచ్చు. వన్‌డ్రైవ్‌ యూజర్స్ అయితే తమ డేటాను డైరెక్ట్‌గా శాంసంగ్‌ క్లౌడ్ నుంచి మైక్రోసాఫ్ట్‌ క్లౌడ్‌లోకి మార్చుకోవచ్చు. అయితే మైక్రోసాఫ్ట్  కేవలం 5జీబీ స్టోరేజ్‌ని మాత్రమే ఉచితంగా అందిస్తుంది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న