క్రోమ్‌ 88లో పాస్‌వర్డ్‌లు పదిలం..
close

Published : 21/01/2021 13:45 IST
క్రోమ్‌ 88లో పాస్‌వర్డ్‌లు పదిలం..

తక్కువ మెమొరీతో నిక్షిప్తమై వెబ్‌ విహారాన్ని సులభతరం చేసిన గూగుల్‌ క్రోమ్‌ ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్స్‌తో యూజర్లలను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు కొత్త 88 వెర్షన్‌లో పాస్‌వర్డ్‌లను సురక్షితంగా మేనేజ్‌ చేసుకునేందుకు సులువైన మార్గాన్ని ప్రవేశపెట్టింది. అదెలాగంటే.. క్రోమ్‌లో సేవ్‌ చేసుకున్న పాస్‌వర్డ్‌లను ఎప్పటికప్పుడు మానిటర్‌ చేయొచ్చు. పెట్టుకున్న లాగిన్‌ తాళాలు ఇట్టే కనిపెట్టేలా ఉన్నాయా? నెట్టింట్లో వాటికి ఏమైనా ముప్పు పొంచి ఉందా?.. లాంటి సెక్యూరిటీ లోపాల్ని రివ్యూ చేసుకుని చెక్‌ పెట్టొచ్చు. ఇప్పటికే మీరు 88 వెర్షన్‌కి అప్‌డేట్‌ అయ్యి ఉంటే.. క్రోమ్‌లోని ప్రొఫైల్‌ ఇమేజ్‌ని సెలెక్ట్‌ చేయండి. 

వచ్చిన డ్రాప్‌డౌన్‌ మెనూలోని ‘కీ’ ఐకాన్‌ గుర్తుని సెలెక్ట్‌ చేయాలి. ఇవేమీ లేకుండా సరాసరి పాస్‌వర్డ్స్‌ విభాగాన్ని ఓపెన్‌ చేసేందుకు అడ్రస్‌బార్‌లో chrome://settings/passwords ( కమాండ్‌ని టైప్‌ చేసి ఎంటర్‌ చేస్తే చాలు. బ్రౌజర్‌లో సేవ్‌ చేసి ఉన్న పాస్‌వర్డ్‌లను ఒకసారి రివ్యూ చేద్దాం అనుకుంటే ‘సేఫ్టీ చెక్‌’ని సెలెక్ట్‌ చేయాలి. కనిపించే ‘చెక్‌ నౌ’తో ఉన్న లాగిన్‌ తాళాల్ని స్కాన్‌ చేయొచ్చు. వీక్‌ పాస్‌వర్డ్‌లుగా క్రోమ్‌ గుర్తించిన వాటిని అప్పటికప్పుడే మార్చుకోవర్చు. డెస్క్‌టాప్‌ వెర్షన్‌లలో ఇప్పటికే కొత్త ఫీచర్‌ అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్‌ యూజర్లకు త్వరలోనే పరిచయం చేయనుంది. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న