WhatsApp: త్వరలో మరో అదిరిపోయే ఫీచర్‌
close

Published : 04/11/2020 14:57 IST
WhatsApp: త్వరలో మరో అదిరిపోయే ఫీచర్‌

త్వరలో వస్తుందని అధికారికంగా వెల్లడించిన వాట్సాప్‌‌

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌‌ తన యూజర్ల కోసం అప్‌డేట్‌ అవుతూనే ఉంటుంది. త్వరలో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తులు చేస్తోంది. బల్క్‌ ఐటమ్‌లను డిలీట్‌ చేసుకుని స్టోరేజీ కెపాసిటీని పెంచుకునేలా ఫీచర్‌ను తీసుకు వస్తామని వాట్సాప్‌ ప్రకటించింది. గత కొన్నిరోజులుగా ఇలాంటి ఫీచర్‌పై వాట్సాప్‌ పని చేస్తుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాట్సాప్‌ అధికారికంగా వెల్లడించడంతో యూజర్లలో నెలకొన్న అనుమానాలు తీరిపోయాయి. ఫీచర్‌కు సంబంధించి అప్‌డేట్‌ను వాట్సాప్‌ తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది. ‘ సందేశాలు, ఫొటోలు, వీడియోలు ఎలాంటివైనా సమీక్షించడం.. ఒకే సారి పెద్దమొత్తంలో తొలగించడం, స్టోరేజీని పెంచుకునేలా చేయడాన్ని సులభతరం చేశాం’ అని  తెలిపింది. ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందో వీడియోను వాట్సాప్‌ షేర్‌ చేసింది. త్వరలోనే ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తామని వెల్లడించింది. 

ఫీచర్‌ను ఎలా వినియోగించుకోవాలంటే..
* వాట్సాప్‌ యాప్‌ను ఓపెన్‌ చేయండి
* మేనేజ్‌ స్టోరేజీ అండ్‌ డేటా క్లిక్‌ చేయండి
* మేనేజ్‌ స్టోరేజీ క్లిక్‌ చేసి డిలీట్‌ చేసుకునే అవకాశం ఉంటుంది

ఫార్వార్డ్ చేసిన సందేశాలు, 5MB కన్నా ఎక్కువ స్టోరేజీ కలిగిన ఫైల్స్‌ను చూపించే ప్రత్యేక విభాగాలను కూడా యూజర్లు పొందుతారు. ఈ ఫీచర్ వల్ల తమకు అవసరం లేని అంశాలను సులభంగా వదిలించుకోవచ్చు. ప్రతి చాట్ ఎంత స్థలాన్ని తీసుకుంటుందో కూడా వాట్సాప్‌ ప్రదర్శిస్తుంది. ‘సెలెక్ట్ ఆల్’ ఆప్షన్ నొక్కడం ద్వారా యూజర్లు స్పేస్ ఫైల్స్, మీడియా, ఇతర సందేశాలను తొలగించుకునే అవకాశం వీలు కలుగుతుందని వాట్సాప్‌ పేర్కొంది. అయితే అవన్నీ వాట్సాప్‌ యాప్‌లో నుంచి తొలిగిపోతాయి కానీ ఫోన్‌ నుంచి కాదనేది యూజర్లు గమనించాలి. ఫీచర్‌తో యాప్‌ స్టోరేజీ క్లీనప్ అవుతుంది.. అంతేగానీ‌ ఫోన్‌ స్టోరేజీని కాదని వాట్సాప్‌ స్పష్టం చేసింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న