WhatsApp: త్వరలో రెండు మొబైల్స్‌లో ఒకే వాట్సాప్‌!
close

Published : 28/09/2021 19:31 IST

WhatsApp: త్వరలో రెండు మొబైల్స్‌లో ఒకే వాట్సాప్‌!

ఇంటర్నెట్‌ డెస్క్: వాట్సాప్‌ అకౌంట్‌ను రెండు మొబైల్స్‌ వాడే ఛాన్స్‌ ఉంటే బాగుండు... ఈ మాట మీరెప్పుడైనా అనుకున్నారా? చాలాసార్లే అనుకొని ఉంటారు. అయితే ప్రస్తుతం ఇది కుదరకపోవచ్చు కానీ, రానున్న రోజుల్లో సులభంగా చేసేయొచ్చు అంటున్నారు టెక్‌ నిపుణులు. వాట్సాప్‌ త్వరలో దీనికి తగ్గట్టుగా మార్పులు చేస్తుండటమే ఇందుకు కారణం. ఒక వాట్సాప్‌ ఖాతాను వేర్వేరు డివైజ్‌ల్లో వాడుకునేలా వాట్సాప్‌ ‘మల్టీ డివైజ్‌ సపోర్టు’ ఫీచర్‌ను ఇటీవల ప్రకటించింది. దీనికి సంబంధించి టెస్టింగ్‌ జరుగుతోంది. త్వరలోనే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఆప్షన్‌ వచ్చిన వెంటనే రెండు ఫోన్లలో వాట్సాప్ వాడుకునే ఆప్షనూ వస్తుందట. 

ఇప్పుడు బీటా టెస్టింగ్‌ రూపంలో అందుబాటులో ఉన్న ‘మల్టీ డివైజ్‌ సపోర్టు’ ఫీచర్‌కు అదనపు హంగులు జోడించాలని వాట్సాప్‌ భావిస్తోంది. ఈ క్రమంలోనే ఒకే వాట్సాప్‌ అకౌంట్‌ను.. రెండు మొబైల్స్‌లో వాడుకునేలా మార్పులు చేస్తున్నారట. దీనికి సంబంధించి కొన్ని వివరాలను టెక్‌ నిపుణులు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. వాటి ప్రకారం చూస్తే.. ఒకే సమయంలో ఒక వాట్సాప్‌ అకౌంట్‌ను ఒకటికి మించి మొబైల్స్‌లో వాడొచ్చు. మొబైల్‌లో రీసెంట్‌ మెసేజ్‌ల డౌన్‌లోడ్‌ అవుతున్నట్లుగా ఓ ఇమేజ్‌ టెక్‌ వెబ్‌సైట్లలో కనిపిస్తోంది. ఇది మల్టీ డివైజ్‌ ఆప్షన్లలో ఒకటి అని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అయితే ఆ ప్రాసెస్‌ ఏంటి, గరిష్ఠంగా ఎన్ని మొబైల్స్‌లో వాడొచ్చు అనేది త్వరలో తెలుస్తుంది. 

మల్టీ డివైజ్‌ సపోర్టు విధానంలో ప్రస్తుతం అయితే ఒక అకౌంట్‌ను ఒక మొబైల్‌తో పాటు నాలుగు ఇతర డివైజ్‌లలో (ట్యాబ్‌, కంప్యూటర్‌ లాంటివి) వాడొచ్చు. దీని కోసం మెయిన్‌ మొబైల్‌ (లాగిన్‌ అయిన ) ఇంటర్నెట్‌కి కనెక్ట్‌ అయి ఉండాల్సిన అవసరం లేదు. దీంతో ఈ ఫీచర్‌ కోసం యూజర్లు చాలా ఆసక్తిగా ఉన్నారు. అయితే ఇతర డివైజ్‌ల్లో మొబైల్‌ లేకపోవడంతో కొంచెం నిరాశచెందారు. కానీ ఇప్పుడు మొబైల్‌ను కూడా ఆ లిస్ట్‌లో యాడ్‌ చేస్తుండటం ఆసక్తికరమే. దీని బీటా టెస్టింగ్‌ను త్వరలోనే ప్రారంభిస్తారని సమాచారం.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న