WhatsApp: మెసేజ్ రియాక్షన్..వాట్సాప్ కొత్త ఫీచర్ 
close

Updated : 26/08/2021 22:37 IST
WhatsApp: మెసేజ్ రియాక్షన్..వాట్సాప్ కొత్త ఫీచర్ 

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది ఉపయోగిస్తున్న ఎన్‌క్రిప్టెడ్ మెజేజింగ్ యాప్ వాట్సాప్‌.  కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్స్‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. స్వైప్‌ రిప్లై, ఆర్కైవ్ కొత్త ఫీచర్‌, గ్రూప్‌ వీడియో కాలింగ్, వ్యూ వన్స్‌, డేటా ట్రాన్స్‌ఫర్ వంటి ఫీచర్లను ఇప్పటికే యూజర్లకు పరిచయం చేసింది. తాజాగా మెసేజ్ రియాక్షన్ పేరుతో మరో కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. దీని ద్వారా వాట్సాప్‌లో మనకు వచ్చిన మెసేజ్‌లపై ఎమోజీల సాయంతో మన అభిప్రాయం తెలుపవచ్చు. అంటే మెసేజ్‌ రిప్లైకి టెక్ట్స్‌ టైప్ చేయకుండా ఎమోజీతో సదరు మెసేజ్‌ గురించి మన ఫీలింగ్ చెప్పవచ్చు. మీకు వచ్చిన మెసేజ్‌కి మీరు రిప్లై ఇవ్వటానికి సదరు మెసేజ్‌పై క్లిక్ చేసి రిప్లై ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీకు ఎమోజీలతోపాటు టెక్ట్స్ ఆప్షన్ కనిపిస్తుంది. అయితే త్వరలో రాబోయే ఫీచర్‌లో రిప్లైతోపాటు రియాక్షన్ అని లేదా రిప్లైపై లాంగ్‌ ప్రెస్ చేస్తే రియాక్షన్స్‌తో కూడిన ఎమోజీల జాబితా కనిపించేలా మార్పులు చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురాన్నట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. 

ఇప్పటికే వాట్సాప్‌లో ఎమోజీ, స్టిక్కర్‌, గిఫ్ ఫీచర్లు ఉన్నాయి. అలానే వాట్సాప్ మాతృసంస్థ ఫేస్‌బుక్‌కి చెందిన మెసేంజర్‌, ఇన్‌స్టాగ్రాంతోపాటు సిగ్నల్‌, టెలిగ్రాం వంటి వాటిలో మెసేజ్ రియాక్షన్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఇప్పుడు కొత్తగా వాట్సాప్‌లోను మెసేజ్ రియాక్షన్ పీచర్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చాక యూజర్‌ తన పంపిన మెసేజ్‌కి అవతలి వ్యక్తి ఎమోజీ రియాక్షన్‌తో రిప్లై ఇస్తే..యూజర్‌ ఛాట్ పేజ్‌పై మీకు మెసేజ్ రియాక్షన్ వచ్చింది అనే సందేశం కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేస్తే మీకు ఎమోజీ రియాక్షన్ కనిపిస్తుంది. ఈ ఫీచర్‌ కోసం యూజర్స్ తమ యాప్‌ని అప్‌డేట్ చేసుకోవాలని వాబీటాఇన్ఫో తెలిపింది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న