WhatsApp Feature: వాట్సాప్‌లో వారికీ చెక్‌ చెప్పేయండి!
close

Published : 07/09/2021 19:38 IST
WhatsApp Feature: వాట్సాప్‌లో వారికీ చెక్‌ చెప్పేయండి!

ఇంటర్నెట్‌ డెస్క్: వాట్సాప్‌ ప్రైవసీ ఫీచర్లలో ఉండే ఎవిరీవన్, మై కాంటాక్ట్స్‌, నోబడీ ఆప్షన్లకు అదనంగా మరొక ఫీచర్‌ రాబోతోంది. యూజర్లు వాట్సాప్‌లో తరచూ ప్రొఫైల్‌ ఇమేజ్‌లను మారుస్తూ ఉంటారు. ఏమేమి మెసేజ్‌లు వచ్చాయో నిమిషానికొకసారి చెక్‌ చేసుకోవడం కొందరికి అలవాటు. అయితే ప్రొఫైల్‌ ఇమేజ్‌ను ప్రతి ఒక్కరూ చూసేలా పెట్టుకుంటే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారి కోసం ప్రైవసీ ఫీచర్లు ఉన్నప్పటికీ నిర్దిష్టమైన కాంటాక్ట్‌ను చూడకుండా చేయలేం. అందుకోసమే వారిని డిజేబుల్‌ చేసే ఫీచర్‌ను వాట్సాప్‌ యూజర్లకు కల్పించబోతోంది. అలాగే లాస్ట్‌ సీన్‌ (వాట్సాప్‌ చెకింగ్ సమయం), ప్రొఫైల్‌ ఫొటో, ఎబౌట్‌ స్టేటస్‌ను ప్రత్యేకమైన వ్యక్తులు/సంస్థలు చూడకుండా డిజేబుల్‌ చేసేయచ్చని వాట్సాప్‌ చెబుతోంది. 2017లోనే ‘స్టేటస్‌’ సెట్టింగ్స్‌లో తీసుకొచ్చిన ‘మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌’ అనే ఆప్షన్‌ను ప్రైవసీ సెట్టింగ్స్‌లో యాడ్‌ చేసేందుకు ప్రయత్నాలను వాట్సాప్‌ ముమ్మరం చేసింది. ఇప్పటికే బీటా వెర్షన్‌లో తీసుకువచ్చామని మిగతా యూజర్లకు త్వరలో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. 

ఎలా చేయొచ్చు..? 

వాట్సాప్‌ యూజర్‌ ప్రొఫైల్‌ ఫొటోను మార్చారనుకుందాం.. అయితే దానిని తన కాంటాక్ట్‌ లిస్ట్‌లోని వ్యక్తులు మాత్రమే చూడాలని భావిస్తే.. మిగతా వారికి కనిపించకుండా సెట్‌ చేసుకునేందుకు ‘మై కాంటాక్ట్స్‌’ ఆప్షన్‌ ఉపయోగపడుతుంది. ఎవరైనా చూడొచ్చనుకుంటే ఎవిరీవన్‌ అని.. ఎవరూ చూడకూడదనుకుంటే నోబడీ ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. అయితే కాంటాక్ట్‌ లిస్ట్‌లోని నిర్దిష్టమైన వ్యక్తి చూడకూడదనుకుంటే మాత్రం ఇప్పటి వరకు ఏమీ చేయలేం. గతంలో ‘స్టేటస్‌’ సెట్టింగ్స్‌లో తీసుకొచ్చిన ‘మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌’ ఆప్షన్‌ను అన్నింటికీ వర్తింపజేయనుంది. కాంటాక్ట్స్‌ లిస్ట్‌లోని సెలెక్ట్‌డ్‌ వ్యక్తి తప్పితే మిగతావారంతా ప్రొఫైల్‌ ఫొటోను చూసే అవకాశం కలుగుతుంది. అలానే లాస్ట్‌ సీన్‌, ఎబౌట్‌ స్టేటస్‌కూ ఈ ఆప్షన్‌ యాడ్‌ కానుంది. ఆండ్రాయిడ్‌, ఐవోఎస్‌ వెర్షన్లలో అప్‌డేట్‌ చేస్తామని పేర్కొంది.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న