జియోనీ మ్యాక్స్‌ ప్రో... ఫీచర్లు ఇవే
close

జియోనీ మ్యాక్స్‌ ప్రో... ఫీచర్లు ఇవే

1/13

జియోనీ నుంచి గతంలో చాలా రకాల ఫోన్లు వచ్చేవి. తక్కువ ధరలో మోస్తరు నుంచి మంచి ఫీచర్లతో మొబైల్స్‌ను తీసుకొచ్చేది. షావోమి, రియల్‌మీ రాకతో నెమ్మదించింది. చాలా రోజుల తర్వాత ఈ రోజు భారతీయ మార్కెట్‌లోకి ఓ లో-ఎండ్‌ మొబైల్‌ను లాంచ్‌ చేసింది. ‘జియోనీ మ్యాక్స్‌ ప్రో’ పేరుతో వచ్చిన ఈ మొబైల్‌ ఫీచర్లేంటో చూద్దాం!

2/13

నీలం, నలుపు, ఎరుపు రంగుల్లో ఈ మొబైల్‌ లభిస్తుంది.

3/13

1.6 జీహెచ్‌జెడ్‌ ఆక్టాకోర్‌ ప్రాసెసర్‌ ఉంటుంది.

4/13

ఇందులో 2+1 స్టైల్‌ స్లాట్‌ ఉంటుంది. అంటే రెండు సిమ్‌ కార్డులు, ఒక మెమొరీ కార్డు ఒకేసారి వాడుకోవచ్చు.

5/13

2 జీబీ ర్యామ్‌, 32 జీబీ ఇంటర్నెల్‌ మెమొరీ వెర్షన్‌లోనే ఈ మొబైల్‌ లభిస్తుంది.

6/13

మొబైల్‌ రక్షణ కోసం ఫేస్‌ లాక్‌ ఫీచర్‌ కూడా ఉంది.

7/13

స్లో మోషన్‌, ఆడియో నోట్‌, టైమ్‌ ల్యాప్స్‌, ఫేస్‌ బ్యూటీ లాంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.

8/13

వెనుకవైపు రెండు కెమెరాలుంటాయి. 13 ఎంపీ కెమెరా సెటప్‌ ఉంటుంది. దాంతో పాటు బొకే లెన్స్‌ కూడా ఇస్తున్నారు. ముందువైపు 5ఎంపీ కెమెరా ఉంటుంది.

9/13

మొబైల్‌ను ఫుల్‌ ఛార్జ్‌ చేసి 24 గంటలు పాటలు వినొచ్చు. 9 గంటలు వీడియోలు చూడొచ్చు. 42 గంటలు కాల్స్‌ మాట్లాడొచ్చు. 12 గంటలు గేమ్స్‌ ఆడొచ్చు. (జియోనీ చెప్పిన వివరాల ప్రకారం)

10/13

ఈ మొబైల్‌ రివర్స్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది. అంటే ఈ మొబైల్‌ నుంచి వేరే మొబైల్‌కు ఛార్జ్‌ చేసుకోవచ్చు.

11/13

5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంటుంది. 2జీ నెట్‌వర్క్‌తో వాడితే 28 రోజుల స్టాండ్‌ బై వస్తుందట.

12/13

6.1 అంగుళాల హెచ్‌డీ ప్లస్‌ టచ్‌ స్క్రీన్‌ ఉంటుంది. టాప్‌లో డ్రాప్‌ స్టయిల్‌ నాచ్‌ ఉంటుంది.

13/13

ప్రస్తుతానికి 3 జీబీ ర్యామ్‌, 32 జీబీ అంతర్గత మెమొరీ వెర్షన్‌ మాత్రమే తీసుకొచ్చారు. దీని ధర ₹6,999.

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న