శాంసంగ్‌ గెలాక్సీ A32 స్పెసిఫికేషన్లు ఇవే...
close

శాంసంగ్‌ గెలాక్సీ A32 స్పెసిఫికేషన్లు ఇవే...

1/7

ఇంటర్నెట్‌ డెస్క్: గెలాక్సీ A సిరీస్‌లో కొత్త మొబైల్‌ను శాంసంగ్‌ ఈ రోజు భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. గత వారం గెలాక్సీ A32 4జీ పేరుతో రష్యాలో విడుదలైన మొబైల్‌ను అదే పేరుతో మన దేశంలో లాంచ్‌ చేశారు. ఈ మొబైల్‌ 5జీ వెర్షన్‌ జనవరిలోనే వచ్చిన విషయం తెలిసిందే. మరి కొత్త గెలాక్సీ A32 4జీ ఫీచర్లేంటో చూద్దామా!

2/7

ఆండ్రాయిడ్‌ 11 ఆధారిత వన్‌ యూఐ 3.0తో పని చేస్తుంది.

3/7

మీడియాటెక్‌ హీలియో జీ 80 ప్రాసెసర్‌ ఉంటుంది. గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటక్షన్‌ ఇస్తున్నారు.

4/7

5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 15 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది.

5/7

వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. ఇది కాకుండా 8 ఎంపీ అల్ట్రావైడ్‌ లెన్స్‌, 5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌, 5 ఎంపీ మాక్రో లెన్స్‌ ఉంటాయి. ముందువైపు 20 ఎంపీ కెమెరా ఉంటుంది.

6/7

6.4 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ ఆమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీని రిఫ్రెష్‌ రేట్‌ 90 హెడ్జ్‌ ఉంటుంది.

7/7

6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉంటుంది. దీని ధర ₹21,199.

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న