రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ.. చాలా స్మార్ట్‌
close

రెడ్‌మీ స్మార్ట్‌ టీవీ.. చాలా స్మార్ట్‌

1/19

రెడ్‌మీ నుంచి భారతీయ మార్కెట్‌లోకి తొలి స్మార్ట్‌ టీవీ వచ్చేసింది. మూడు రకాల సైజుల్లో ఈ టీవీలను రెడ్‌మీ లాంచ్‌ చేసింది. బడ్జెట్‌ ధరల్లో మంచి ఫీచర్లతో తీసుకొచ్చామని రెడ్‌మీ ప్రకటించింది. మరి ఆ ఫీచర్లు, ధర తదితర వివరాలు చూసేద్దామా!

2/19

ఈ టీవీలు మూడు సైజుల్లో లభిస్తాయి. 50 అంగుళాలు, 55 అంగుళాలు, 65 అంగుళాల మోడల్స్‌ తీసుకొస్తున్నారు.

3/19

టీవీ పార్సిల్‌ వచ్చే కార్టన్‌ బాక్స్‌ను ఎకో ఫ్రెండ్లీగా రూపొందించారట. ఆ బాక్స్‌తో కార్టన్‌ ర్యాక్‌ను తయారు చేసుకోవచ్చట.

4/19

ఆటో లో లేటన్సీ మోడ్‌ను కూడా ఈ టీవీల్లో పొందుపరిచారు.

5/19

ఈ టీవీల్లో మొత్తం ఆరు పోర్టులుంటాయి. రెండు యూఎస్‌బీ 2.0, ఒక హెడ్‌ఫోన్‌, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు ఉంటాయి. అందులో ఒకటి ఈఆర్క్‌ పోర్టు.

6/19

క్వాడ్‌ కోర్‌ ఏ55 సీపీయూ వాడుతున్నారు. మాలీ జీ 52 ఎంపీ2 ఉంటుంది. 2 జీబీ ర్యామ్‌, 16 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉంటాయి.

7/19

బ్లూటూత్‌ 5.0, డ్యూయల్‌ బ్యాండ్‌ వైఫై సపోర్టుతోపాటు క్విక్‌ మ్యూట్, వేక్‌ లాంటి ఫీచర్లు కూడా ఉంటాయి.

8/19

ఎంఐ హోం యాప్‌ ద్వారా ఈ టీవీని మీ మొబైల్‌తో సులభంగా ఆపరేట్‌ చేయొచ్చు.

9/19

ఆండ్రాయిడ్‌ టీవీ 10 ఓఎస్‌తో ఈ టీవీలు తీసుకొస్తున్నారు. ఇందులో గూగుల్‌ అసిస్టెంట్‌ను మరింత ప్రభావవంతంగా వినియోగించుకోవచ్చు.

10/19

ఈ టీవీలు షావోమికి చెందిన ప్యాచ్‌వాల్‌ యూజర్‌ ఇంటర్ఫేస్‌తో పని చేస్తాయి.

11/19

శబ్ద నాణ్యత బాగుండేలా... టీవీ దిగువ వైపు 30 వాట్‌ స్పీకర్స్‌ ఇస్తున్నారు.

12/19

వీడియోను నాణ్యతను మరింత మెరుగుపరిచి చూపించడానికి వివిడ్‌ పిక్చర్‌ ఇంజిన్‌ సాంకేతికతను వాడుతున్నారు.

13/19

మెరుగైన నాణ్యత కోసం హైబ్రిడ్‌ ఎల్‌వోజీ గామా టెక్నాలజీ వినియోగిస్తున్నారు.

14/19

హెచ్‌డీఆర్‌ 10 ప్లస్‌ సాంకేతికత ఉంటుంది.

15/19

డీటీఎస్‌ వర్చువల్‌ ఎక్స్‌, డీటీఎస్‌ హెచ్‌డీ, డాల్బీ విజన్‌ లాంటి శబ్ద సాంకేతికతలు ఈ టీవీల్లో ఉంటాయి.

16/19

4కె హెచ్‌డీఆర్‌ టెక్నాలజీతో ఈ టీవీలు పని చేస్తాయి.

17/19

50 అంగుళాల టీవీ ధర ₹32,999.

18/19

55 అంగుళాల టీవీ ధర ₹38,999.

19/19

65 అంగుళాల టీవీ ధర ₹57,999.

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న