మీ పేరు మీద ఎన్ని నెంబర్లున్నాయో ఇలా తెలుసుకోవచ్చు...
close

మీ పేరు మీద ఎన్ని నెంబర్లున్నాయో ఇలా తెలుసుకోవచ్చు...

1/10

మనకు తెలియకుండానే మన పేరు మీద ఎన్ని ఫోన్‌ నంబర్లున్నాయో తెలుసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ను టెలికాం విభాగం(డీవోటీ) రూపొందించింది. . http://tafcop.dgtelecom.gov.in అనే వెబ్‌సైట్‌లో మొబైల్‌ నంబరు.. దానికి వచ్చే ఓటీపీ నమోదు చేయగానే మన పేరుమీద ఉన్న ఫోన్‌ నంబర్ల వివరాలన్నీ వస్తాయి. వాటిలో మనకు అవసరం లేనివి, మనకు తెలియకుండా మన పేరుమీద ఉన్న వాటిని సెలక్ట్‌ చేసి సబ్మిట్‌ చేస్తే.. టెలికం శాఖ చర్యలు తీసుకుంటుంది.

2/10

ఈ సర్వీసు తొలుత ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ టెలికం సర్కిళ్లలో ప్రారంభించారు. త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తారు.

3/10

http://tafcop.dgtelecom.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాక... మీ పది అంకెల మొబైల్‌ నెంబరును ఎంటర్‌ చేసి, రిక్వెస్ట్‌ ఓటీపీ క్లిక్‌ చేయాలి.

4/10

మీ మొబైల్‌ నెంబరుకు వచ్చిన ఓటీపీ ఈ బాక్స్‌లో ఎంటర్‌ చేయాలి. ఓటీపీ ఎంటర్‌ చేశాక ‘వ్యాలిడేట్‌’ బటన్‌ను క్లిక్‌ చేయాలి. ఒకవేళ ఓటీపీ రాకపోతే ‘రీసెండ్‌’ ఓటీపీ క్లిక్‌ చేయొచ్చు.

5/10

పేజీలోకి ఎంటర్‌ అయ్యాక... పైన టాప్‌లో మీ పేరు నమోదు చేయాల్సి ఉంటుంది. అవసరం లేని నెంబరు రిపోర్టు చేసేటప్పుడు మీ పేరు అవసరం పడుతుంది.

6/10

మీరు లాగిన్‌ అయిన మొబైల్‌ నెంబరుకు అనుబంధంగా ఉన్న మొబైల్‌ నెంబర్ల జాబితా దిగువ వస్తుంది. అందులో మీరు వాడుతున్నవేవో చెక్‌ చేసుకోండి.

7/10

మీకు సంబంధం లేని, మీరు వాడని, మీకు అక్కర్లేని నెంబర్లు ఏవన్నా ఉంటే ఈ పేజీలో ఎంచుకోవాలి. మీరు ఎంచుకున్న నెంబరును టిక్‌ పెట్టి... దాని దిగువ ఉన్న కారణాన్ని సెలక్ట్‌ చేసుకోండి. ఆతర్వాత దిగువ ఉన్న ‘రిపోర్టు’ బటన్‌ను క్లిక్‌ చేయండి.

8/10

మీకు అక్కర్లేని నెంబర్లను ఎంచుకొని, రిపోర్టు చేశాక... మీకో టికెట్‌ ఐడీ రిఫరెన్స్‌ నెంబరు వస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం ఆ నెంబరును నోట్‌ చేసి పెట్టుకోండి.

9/10

మీరు పంపిన రిక్వెస్ట్‌ ఎంతవరకు వచ్చిందనే విషయాన్ని ట్రాకింగ్‌ ద్వారా తెలుసుకోవచ్చు. నెంబర్ల జాబితాకు పైన ట్రాక్‌/ క్యాన్సిల్‌ అని ఒక ఆప్షన్‌ ఉంటుంది. అందులో మీ రిఫరెన్స్‌ ఐడీని ఎంటర్‌ చేసి మీ రిక్వెస్ట్ స్టేటస్‌ను ట్రాక్‌ చేయొచ్చు.

10/10

రిఫరెన్స్‌ నెంబరు ఎంటర్‌ చేసిన తర్వాత... మీ రిపోర్ట్‌ స్టేటస్‌ చూపిస్తుంది. దాంతోపాటు మీ రిపోర్టును క్యాన్సిల్‌ చేసుకునే ఆప్షన్‌ కూడా ఉంటుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న