Redmi 10T 5G : రెడ్‌మీ తొలి 5జీ ఫోన్ ఫీచర్లివే
close

Redmi 10T 5G : రెడ్‌మీ తొలి 5జీ ఫోన్ ఫీచర్లివే

1/11

తక్కువ ధర ఎక్కువ ఫీచర్స్‌తో ఫోన్‌ అనగానే గుర్తొచ్చే మొబైల్స్‌లో రెడ్‌మీ ఒకటి. తాజాగా ఈ కంపెనీ నుంచి తొలి 5జీ మొబైల్‌... నోట్‌ 10T 5G లాంచ్‌ చేసింది. ఈ రోజు ఈ మోడల్‌ను భారత మార్కెట్లోకి అధికారికంగా లాంచ్‌ చేశారు. మరి దాని ఫీచర్లేంటి, ధర ఎంత అనే వివరాలు చూద్దాం!

2/11

రెడ్‌మీ నోట్‌ 10T 5Gలో యూఎఫ్ఎస్‌ 2.2 స్టోరేజ్ ఇస్తున్నారు. మెమొరీ కార్డుతో 1టీబీ వరకు ఎక్స్‌పాండ్‌ చేసుకోవచ్చు.

3/11

ఫోన్‌లో టెక్స్ట్‌ ఎక్కువగా చదివే వారి కోసం రీడింగ్‌ మోడ్‌ 3.0ని ఇస్తున్నారు. దీంతో కంటికి అనుకూలమైన కలర్‌ టెంపరేచర్‌ సెట్ చేసుకోవచ్చు.

4/11

మల్టిపుల్‌ హాండ్స్ ఫ్రీ వాయిస్‌ అసిస్టెంట్‌ ఫీచర్‌ ఇస్తున్నారు. దీంతో వాయిస్‌ కమాండ్స్ ద్వారా ఫోన్‌ని ఆపరేట్ చెయ్యొచ్చు.

5/11

రెండు సిమ్‌లు 5జీ నెట్‌వర్క్‌ను సపోర్టు చేస్తాయి. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది. అయితే ఏ 5జీ బ్యాండ్స్‌ ఇస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది.

6/11

గేమింగ్ ప్రియుల కోసం మాలి- జీ 57 గ్రాఫిక్ కార్డ్ ఉపయోగించారు. అలానే అద్భుతమైన గేమింగ్ పెర్ఫార్మెన్స్‌ కోసం గేమ్‌ టర్బో మోడ్ ఇస్తున్నారు.

7/11

ఇందులో 7 నానో మీటర్‌ ఆర్కిటెక్చర్‌తో రూపొందిన మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఇస్తున్నారు.

8/11

90 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. దీనికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది.

9/11

నాలుగు కెమెరాలు ఇస్తున్నారు. వెనుకవైపు 48 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు రెండు 2 ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ఫొటోగ్రఫీ ప్రియుల కోసం స్లో మోషన్‌, టైం లాప్స్‌ ఫీచర్స్‌తోపాటు ప్రో కలర్, కలర్ ఫోకస్‌, నైట్ మోడ్‌ ఇస్తున్నారు. ముందువైపు 8 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు.

10/11

రెడ్‌మీ నోట్‌ 10T 5Gలో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. ఇది 18 వాట్‌ టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు చేస్తుంది.

11/11

4 జీబీ ర్యామ్‌/ 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర ₹13,999. 6 జీబీ ర్యామ్‌/ 128 జీబీ వేరియంట్ ధర ₹15,999. గ్రాఫైట్ బ్లాక్, క్రోమియమ్ వైట్, మింట్ గ్రీన్, మెటాలిక్ బ్లూ రంగుల్లో లభిస్తుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న