Moto e40: ₹10 వేలలోపు ధరలో మోటో కొత్త ఫోన్‌
close

Moto e40: ₹10 వేలలోపు ధరలో మోటో కొత్త ఫోన్‌

1/10

మోటోరోలా కంపెనీ ‘ఈ’ సిరీస్‌లో మరో కొత్త మోడల్‌ ఫోన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మోటో ఈ40 పేరుతో బడ్జెట్‌ శ్రేణిలో తీసుకొచ్చిన ఈ మోడల్‌లో ఫీచర్లిలా ఉన్నాయి.

2/10

ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో ఈ ఫోన్‌ పనిచేస్తుంది.

3/10

5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 40 గంటలపాటు నిరంతరాయంగా పనిచేస్తుందని మోటోరోలా తెలిపింది.

4/10

90 హెర్జ్‌ రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల మ్యాక్స్‌ విజన్‌ హెచ్‌డీ+ ఐపీఎస్ డిస్‌ప్లే ఇస్తున్నారు.

5/10

మోటో ఈ40లో యూనిసాక్‌ టీ700 ప్రాసెసర్‌ ఉపయోగించారు. 4జీబీ ర్యామ్‌ ఇస్తున్నారు.

6/10

ఈ ఫోన్‌లో మొత్తం నాలుగు కెమెరాలున్నాయి. వెనుకవైపు 48 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు రెండు 2 ఎంపీ కెమెరాలు ఇచ్చారు.

7/10

ముందు భాగంలో సెల్ఫీల కోసం 8 ఎంపీ కెమెరా అమర్చారు.

8/10

ఫేస్‌ అన్‌లాక్‌, ఫింగర్‌ ప్రింట్‌ రీడర్‌, ఐపీ52 వాటర్ రెసిస్టెంట్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. గూగుల్ అసిస్టెంట్ కోసం ప్రత్యేక కీ ఇస్తున్నారు.

9/10

4 జీబీ ర్యామ్‌/64 జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్ ధర రూ. 9,499.

10/10

మోటో ఈ40ని అక్టోబరు 17 నుంచి ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌ ద్వారా కొనుగోలు చేయొచ్చు. కార్బన్‌ గ్రే, పింక్‌ క్లే రంగుల్లో లభిస్తుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న