Realme GT Neo 2: 30 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్‌
close

Realme GT Neo 2: 30 నిమిషాల్లో బ్యాటరీ ఫుల్‌

1/10

రియల్‌మీ జీటీ సిరీస్‌లో మూడో మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రియల్‌మీ జీటీ నియో 2 పేరుతో ఈ ఫోన్‌ను పరిచయం చేసింది. మరి ఈ మోడల్‌ ధర.. ఫీచర్లు.. ఇతర వివరాలిలా ఉన్నాయి.

2/10

120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.62 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ శాంసంగ్‌ ఈ4 అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు.

3/10

స్నాప్‌డ్రాగన్‌ 870 5జీ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇందులోని జీటీ మోడ్‌ 2.0 గేమ్స్ ఆడేప్పుడు యూజర్‌కి అద్భుతమైన గేమింగ్ అనుభూతిని అందిస్తుంది.

4/10

5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 36 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ అవుతుందని రియల్‌మీ చెబుతోంది.

5/10

ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 11 ఆధారిత రియల్‌మీ యూఐ 2.0 ఓఎస్‌తో పనిచేస్తుంది.

6/10

ఫోన్ వేడెక్కుండా ఇందులో స్టెయిన్‌లెస్‌ స్టీల్ వాపర్ కూలింగ్ టెక్నాలజీని ఉపయోగించారు.

7/10

గేమర్స్ కోసం హెచ్‌డీఆర్‌10+ సపోర్ట్‌తో 600 హెర్జ్‌ టచ్‌ శాంప్లింగ్‌ రేట్ ఇస్తున్నారు. ఇందుకోసం ఎక్స్ యాక్సిస్‌ లీనియర్ మోటార్‌ను అమర్చారు.

8/10

ఇందులో నాలుగు కెమెరాలున్నాయి. వెనుకవైపు 64 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 8 ఎంపీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌, 2 ఎంపీ కెమెరాలున్నాయి. ముందు సెల్ఫీల కోసం 16 ఎంపీ కెమెరా అమర్చారు.

9/10

రియల్‌మీ జీటీ నియో 2ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు. 8జీబీ ర్యామ్‌/ 128 జీబీ అంతర్గత మెమొరీ వేరియంట్ ధర రూ. 31,999. 12జీబీ/256జీబీ ధర రూ. 35,999.

10/10

అక్టోబరు 17 నుంచి రియల్‌మీ, ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ల నుంచి ఈ మోడల్‌ను కొనుగోలు చేయొచ్చు. నియో బ్లాక్‌, నియో బ్లూ, నియో గ్రీన్‌ రంగుల్లో లభిస్తుంది.

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న