నో టీ స్‌ బో ర్డు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 26 Jul 2021 03:08 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

యూపీఎస్సీ- 46 పోస్టులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 46

పోస్టులు - ఖాళీలు: అసిస్టెంట్‌ డైరెక్టర్‌-04, రిసెర్చ్‌ ఆఫీసర్‌ (ఇంప్లిమెంటేషన్‌)-08, సీనియర్‌ గ్రేడ్‌ ఆఫీసర్లు-34.

అర్హత: పోస్టుల్ని అనుసరించి బ్యాచిలర్స్‌ డిగ్రీ, సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ, డిప్లొమా/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేది: 2021, ఆగస్టు 12.

వెబ్‌సైట్‌:  www.upsc.gov.in/


ఎస్‌ఎస్‌బీలో 115 హెడ్‌ కానిస్టేబుల్‌ ఖాళీలు

భారత ప్రభత్వ హోంమంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) డైరెక్టరేట్‌ జనరల్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

హెడ్‌ కానిస్టేబుల్‌ (మినిస్టీరియల్‌)

మొత్తం ఖాళీలు: 115

అర్హత: ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత, ఇంగ్లిష్‌, హిందీ టైపింగ్‌ నైపుణ్యాలు.

వయసు: 18 నుంచి 25 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్‌ టెస్ట్‌, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌(జులై 24-30) లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: www.ssbrectt.gov.in/


ఐఏఎఫ్‌లో 85 గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ శాశ్వత ప్రాతిపదికన వివిధ డివిజన్లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 85 పోస్టులు: ఎల్‌డీసీ, కార్పెంటర్‌, పెయింటర్‌, మెస్‌ స్టాఫ్‌, ఎంటీఎస్‌, స్టోర్‌ కీపర్‌, హిందీ టైపిస్ట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత. డ్రైవింగ్‌ లైనెన్స్‌, హిందీ, ఇంగ్లిష్‌ టైపింగ్‌ స్పీడ్‌.

వయసు: 18 నుంచి 25 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా. దరఖాస్తు

విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌(జులై 24-30) లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు.

వెబ్‌సైట్‌: https://indianairforce.nic.in/


ప్రవేశాలు

అగ్రికల్చరల్‌ వర్సిటీ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌

గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చరల్‌ యూనివర్సిటీ (ఆంగ్రూ) 2021-2022 విద్యా సంవత్సరానికి అగ్రిసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా డిప్లొమా అభ్యర్థులకి బీఎస్సీ అగ్రికల్చరల్‌ డిగ్రీ ప్రోగ్రాములో ప్రవేశాలు కల్పిస్తారు.

విభాగాలు: అగ్రికల్చర్‌, సీడ్‌ టెక్నాలజీ, ఆర్గానిక్‌ ఫార్మింగ్‌

మొత్తం సీట్లు: 185.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 31.12.2021 నాటికి 17 - 22 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ ఆధారంగా.

అగ్రిసెట్‌ పరీక్ష తేది: 13.09.2021.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేది: 2021, ఆగస్టు 13.

దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేది: 2021, ఆగస్టు 21.

వెబ్‌సైట్‌: https://angrau.ac.in/


ఏయూ-ఇంజినీరింగ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌

విశాఖపట్నం(ఏపీ)లోని ఆంధ్రా యూనివర్సిటీ 2021 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఈఈటీ) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏయూఈఈటీ)

కోర్సు: ఆరేళ్ల బీటెక్‌ + ఎంటెక్‌ డ్యుయల్‌ డిగ్రీ ప్రోగ్రాములు

అర్హత: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణత.

ఎంపిక విధానం: ఏయూ నిర్వహించే ఎంట్రెన్స్‌ టెస్ట్‌ ఆధారంగా.

పరీక్ష తేది: 2021, ఆగస్టు 29.. పరీక్షా కేంద్రాలు: విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తుకు చివరి తేది: 2021, ఆగస్టు 17. రూ.1500 ఆలస్య రుసుముతో చివరి తేది: 2021, ఆగస్టు 24.

వెబ్‌సైట్‌: http://aueet.audoa.in/

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని