Updated : 13 Sep 2021 06:20 IST

ఏపీ హైకోర్టులో 174 పోస్టులు

ప్రభుత్వ ఉద్యోగాలు


ఏపీ హైకోర్టులో 174 పోస్టులు

 

అమరావతిలోని హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 174, పోస్టులు - ఖాళీలు: అసిస్టెంట్‌-71, ఎగ్జామినర్‌-29, టైపిస్ట్‌-35, కాపియిస్ట్‌-39.

అర్హత: ఆర్ట్స్‌/ సైన్స్‌/ లా/ కామర్స్‌లో డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత, టైప్‌రైటింగ్‌ (ఇంగ్లిష్‌)లో హయ్యర్‌గ్రేడ్‌ అర్హత.

వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ ఆబ్జెక్టివ్‌ టైప్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, సెప్టెంబరు 30.

వెబ్‌సైట్‌: https://hc.ap.nic.in/


ఇండియన్‌ నేవీ - 181 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్లు

ఇండియన్‌ నేవీ 2022 జూన్‌ (ఏటీ 22) కోర్సు షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్ల భర్తీకి అవివాహితులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
* షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 181, బ్రాంచిల వారీగా ఖాళీలు: ఎగ్జిక్యూటివ్‌ బ్రాంచ్‌-90, ఎడ్యుకేషన్‌ బ్రాంచ్‌ (ఎడ్యుకేషన్‌)-18, టెక్నికల్‌ బ్రాంచ్‌-73.

విభాగాలు: జనరల్‌ సర్వీస్‌, ఏర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌, అబ్జర్వర్‌, ఎల‌్రక్టికల్‌ బ్రాంచ్‌, నావల్‌ ఆర్కిటెక్ట్‌ తదితరాలు.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, ఎంఏ, ఎమ్మెస్సీ ఉత్తీర్ణత, టెక్నికల్‌ స్కిల్స్‌. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూలు, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, సెప్టెంబరు 21.

దరఖాస్తులకు చివరి తేది: 2021, అక్టోబరు 05.

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/


సీ-డ్యాక్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

మొహాలీలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 33, పోస్టులు-ఖాళీలు: ప్రాజెక్ట్‌ మేనేజర్‌-03, ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌-26, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌-03, ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌-01.

విభాగాలు: సాఫ్ట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, మొబైల్‌ అప్లికేషన్‌, సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ డెవలపర్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, సెప్టెంబరు 30.

వెబ్‌సైట్‌: https://www.cdac.in/


ప్రవేశాలు


ఐఐటీ బాంబే - యూసీడ్‌, సీడ్‌ 2022

 

యూసీడ్‌, సీడ్‌ 2022 ప్రకటనలు విడుదలయ్యాయి. ఈ పరీక్షల ద్వారా ప్రఖ్యాత సంస్థలైన ఐఐఎస్సీ, ఐఐటీ, ఐఐఐటీడీఎంలలో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌, పీహెచ్‌డీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షల్ని ఐఐటీ, బాంబే నిర్వహిస్తోంది.

1) అండర్‌ గ్రాడ్యుయేట్‌ కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ (యూసీడ్‌) 2022

కోర్సు: బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడిజైన్‌). అర్హత: 2021లో ఇంటర్‌ పూర్తయిన లేదా 2022లో పూర్తి కాబోయే ఇంటర్‌ అభ్యర్థులు అర్హులు.

వయసు: అక్టోబరు 01, 1997 తర్వాత జన్మించి ఉండాలి. కేవలం రెండు సార్లు మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది.

2) కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ఫర్‌ డిజైన్‌ (సీడ్‌) 2022

అర్హత: ఇంటర్మీడియట్‌ తర్వాత కనీసం మూడేళ్ల ప్రోగ్రాములైన డిగ్రీ/ డిప్లొమా/ పీజీ డిగ్రీ (లేదా) జులై 2022 నాటికి జీడీ ఆర్ట్స్‌ డిప్లొమా ప్రోగ్రాం (10+5 స్థాయి) ఉత్తీర్ణత. వయసు: సీడ్‌ పరీక్షకి వయసుతో సంబంధం లేదు, ఎన్నిసార్లైనా ఈ పరీక్ష రాసుకోవచ్చు.

ప్రవేశాలు కల్పిస్తోన్న ప్రాంగణాలు: ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ బాంబే, ఐఐటీ దిల్లీ, ఐఐటీ గువహటి, ఐఐటీ హైదరాబాద్‌, ఐఐటీ కాన్పూర్‌, ఐఐటీ రూర్కీ, ఐఐఐటీడీఎం జబల్‌పూర్‌. ఎంపిక విధానం: కామన్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: మహిళా, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1600, ఇతరులు రూ.3200 చెల్లించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 2021, అక్టోబరు 10.

* సీడ్‌ 2022 పరీక్ష తేది: జనవరి 23, 2022.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్‌, విశాఖపట్నం.

వెబ్‌సైట్‌: https://www.iitb.ac.in/


నైపెడ్‌లో డిప్లొమా కోర్సులు

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖకు చెందిన సికిందరాబాద్‌ (మనోవికాస్‌నగర్‌) ప్రధాన కేంద్రంగా ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ది ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ ఇంటలెక్చువల్‌ డిజెబిలిటీస్‌ (దివ్యాంగ్‌జన్‌) 2021-2022 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు: డిప్లొమా ఇన్‌ ఎర్లీ చైల్డ్‌హుడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌, డిప్లొమా ఇన్‌ ఒకేషనల్‌ రిహెబిలిటేషన్‌

అందిస్తున్న ప్రాంగణాలు: నైపెడ్‌ సికిందరాబాద్‌, నైపెడ్‌ కోల్‌కతా, నైపెడ్‌, నవీ ముంబయి

అర్హత: ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, సెప్టెంబరు 30.

వెబ్‌సైట్‌: https://niepid.nic.in/


అప్రెంటిస్‌లు

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలో 339 ఖాళీలు

సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వే, నాగ్‌పుర్‌ డివిజన్‌ వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 339

ట్రేడులు: ఫిట్టర్‌, కార్పెంటర్‌, వెల్డర్‌, కోపా, ఎల‌్రక్టీషియన్‌, ప్లంబర్‌, పెయింటర్‌, వైర్‌మెన్‌, డీజిల్‌ మెకానిక్‌ తదితరాలు.

అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

వయసు: 01.09.2021 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: పదో తరగతి, ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2021, అక్టోబరు 05.

వెబ్‌సైట్‌: https://secr.indianrailways.gov.in/Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని