అందరికీ ఫిట్‌నెస్‌.. జెబా మాట!

పాతికేళ్లకే ఆరంకెల జీతం.. మూడు దేశాల్లోని కార్పొరేట్‌ సంస్థల్లో మంచి హోదాలో కొలువు. ఇదీ జెబా జైదీ పరిచయం. ఇవన్నీ వదిలేసి ‘బంకర్‌ ఫిట్‌’తో ఓ స్టార్టప్‌ ప్రారంభించిందామె. ఎందుకంటే తను ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌.

Updated : 04 Sep 2021 05:01 IST

పాతికేళ్లకే ఆరంకెల జీతం.. మూడు దేశాల్లోని కార్పొరేట్‌ సంస్థల్లో మంచి హోదాలో కొలువు. ఇదీ జెబా జైదీ పరిచయం. ఇవన్నీ వదిలేసి ‘బంకర్‌ ఫిట్‌’తో ఓ స్టార్టప్‌ ప్రారంభించిందామె. ఎందుకంటే తను ఫిట్‌నెస్‌ ఫ్రీక్‌. యంగిస్థాన్‌ని మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉంచాలన్నదే తన లక్ష్యమట. నాణ్యమైన కంటెట్‌తో ఈ యాప్‌ని అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంచారు.

ఏంటీ యాప్‌?

యూత్‌ని ఫిట్‌నెస్‌ బాట పట్టించడానికి మొదలైందీ యాప్‌. పూర్తిగా ఉచితం. ఫిట్‌నెస్‌, యోగా నిపుణులు, న్యూట్రిషనిస్ట్‌లు రూపొందించిన వీడియోల్ని అప్‌లోడ్‌ చేస్తుంటారు. ఇందులో వాణిజ్య ప్రకటనలు ఉండవు. శారీరక, మానసిక ఆరోగ్యం చేకూర్చే వేదిక మా బంకర్‌ఫిట్‌ అంటున్నారు స్టార్టప్‌దారులు. బంకర్‌ఫిట్‌ యాప్‌కి మాతృసంస్థ ‘స్పెక్టాకామ్‌’. ఇందులో భారతీ ఎయిర్‌టెల్‌కి పదిశాతం వాటా ఉంది.

అందరికీ..

దేశంలోని ప్రతి ఒక్కరికీ చేరువ కావడమే మా లక్ష్యం అంటున్నారు. ప్రస్తుతం ఇంగ్లిష్‌, హిందీ, తమిళంతోపాటు తెలుగులోనూ వీడియోలు అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఇతర భాషల్నీ చేర్చుతున్నారు. బిగినర్స్‌, ఇంటర్మీడియట్‌, అడ్వాన్స్‌డ్‌ అంటూ అన్నివర్గాల వారికి సరిపోయే ఫిట్‌నెస్‌ వర్కవుట్లు అప్‌లోడ్‌ చేస్తున్నారు.

ఎలాంటివి?

ప్రస్తుతం ఈ యాప్‌ ఎక్కువగా హెచ్‌ఐఐటీ (హై ఇంటెన్సిటీ ఇంటర్వల్‌ ట్రైనింగ్‌) వర్కవుట్లపై దృష్టి పెడుతోంది. ఇందులో బాడీవెయిట్‌, డంబెల్స్‌, రెసిస్టెన్స్‌ వ్యాయామాలు అందుబాటులో ఉన్నాయి. యోగా విభాగంలో అన్నిరకాల ఆసనాలు వేసి చూపిస్తూ వాటి ఉపయోగాలు వివరిస్తున్నారు. వయసు, శరీర బరువు ఆధారంగా ఎవరు ఎలాంటి పౌష్టికాహారం తీసుకోవాలో చెబుతున్నారు. యాప్‌ని ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేస్తూ కొత్త వీడియోలు చూడొచ్చు. ఇప్పటిదాకా ఈ యాప్‌ని లక్షన్నరమంది డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని