నా మాటే ఆసనం!

ఏంటి అలా చూస్తున్నారు. ‘నా మాటే శాసనం’ కదా.. ఆసనం అంటున్నారేంటనా..? పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ చిన్నారి ఏకంగా వంద ఆసనాలు వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది మరి. పనిలో పనిగా

Updated : 03 Sep 2021 05:30 IST

ఏంటి అలా చూస్తున్నారు. ‘నా మాటే శాసనం’ కదా.. ఆసనం అంటున్నారేంటనా..? పట్టుమని పదేళ్లు కూడా లేని ఓ చిన్నారి ఏకంగా వంద ఆసనాలు వేసి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది మరి. పనిలో పనిగా ఓ రికార్డూ సాధించేసింది. ఇంతకీ ఎవరా బుడత అంటే...

యోగా ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఆసనాలు వేయాలంటే కాస్త కష్టంతో కూడుకున్న పని. ఎంతో ప్రాక్టీస్‌ చేస్తే కానీ ఆసనాలు వేయలేం. కానీ గుజరాత్‌ రాష్ట్రం పోరుబందర్‌కు చెందిన ఎనిమిదేళ్ల ప్రిన్సీ మహేష్‌భాయి జెత్వా మాత్రం యోగాసనాలతో అదరగొడుతోంది.

పట్టుదల ఎక్కువే..

కేవలం నాలుగు నిమిషాల 15 సెకన్లలో ఏకంగా 101 ఆసనాలు వేసి అందరితో ఔరా! అనిపించింది. ఇది నిజంగా వరల్డ్‌ రికార్డే. ఆగస్టు 9వ తేదీన ఈ ఘనతను సాధించింది. దీంతో ‘వరల్డ్‌ రికార్డ్స్‌ ఇండియా’లో స్థానం సంపాదించేసింది. అంత చిన్న వయసులోనే ప్రిన్సీ ఇంతటి ఘనత సాధించడంతో తల్లిదండ్రులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ‘మా ప్రిన్సీ అంతే.. ఏదైనా ఇట్టే నేర్చేసుకుంటుంది. తనకు పట్టుదల ఎక్కువ’ అని మురిసిపోతున్నారు. ఏంటి.. ఇది చదివాక మీరూ యోగాసనాలు వేద్దామనుకుంటున్నారా? మంచిదే కానీ... ముందు శిక్షణ తీసుకోండి నేస్తాలూ!


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని