గ్లవుజులు ధరిస్తున్నారా?

కొత్త కరోనా వైరస్‌ బారినపడకుండా కొందరు చేతులకు గ్లవుజులు ధరించటం చూస్తూనే ఉన్నాం. వీటితో పూర్తి రక్షణ....

Published : 26 May 2020 00:28 IST

కొత్త కరోనా వైరస్‌ బారినపడకుండా కొందరు చేతులకు గ్లవుజులు ధరించటం చూస్తూనే ఉన్నాం. వీటితో పూర్తి రక్షణ లభిస్తుందని కచ్చితంగా చెప్పలేం. గ్లవుజులు వేసుకున్నామన్న ధీమాతో మాస్కు ధరించటం, ఇతరులకు దూరంగా ఉండటం వంటి జాగ్రత్తలు అంతగా పాటించకపోయే ప్రమాదమూ ఉంది. కనిపించిన వస్తువులన్నింటనీ ముట్టుకోవచ్ఛు ఒకవేళ ఆయా వస్తువులపై వైరస్‌ ఉండి, అది గ్లవుజులకు అంటుకుంటే? తాకిన వస్తువులన్నింటికీ వైరస్‌ అంటుకుంటుంది. అదే చేత్తో ముఖాన్ని తాకితే తమకు తామే వైరస్‌ను అంటించుకున్నట్టూ అవుతుంది. అలాగే ధరించిన గ్లవుజులను సరిగా తీయటమూ తెలియాలి. లేకపోతే వైరస్‌ను కట్టడి చేయాలనే లక్ష్యమే నీరుగారిపోతుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని