ఇవీ గుండెజబ్బు సూచికలే!

చేతి, కాలి వేలి గోళ్ల దిగువన లేదూ చర్మం మీద ఎక్కడైనా పసుపు, నారింజ మిశ్రమ రంగులో దద్దులాంటిది వస్తోందా? అయితే జాగ్రత్త పడాల్సిందే. దీన్ని చాలామంది చర్మ సమస్యనే అనుకుంటారు గానీ ఇవి గుండెజబ్బుకు సంకేతం కావొచ్చు.

Published : 22 Dec 2020 01:01 IST

చేతి, కాలి వేలి గోళ్ల దిగువన లేదూ చర్మం మీద ఎక్కడైనా పసుపు, నారింజ మిశ్రమ రంగులో దద్దులాంటిది వస్తోందా? అయితే జాగ్రత్త పడాల్సిందే. దీన్ని చాలామంది చర్మ సమస్యనే అనుకుంటారు గానీ ఇవి గుండెజబ్బుకు సంకేతం కావొచ్చు. ట్రైగ్లిజరైడ్ల మోతాదులు బాగా పెరిగిపోతే ఇలా చర్మం మీద చిన్న చిన్న పొక్కులు, గుల్లల వంటివి బయలుదేరతాయి. ట్రైగ్లిజరైడ్లు గుండె ఆరోగ్యానికి చేటు తెచ్చిపెడతాయి. వీటి స్థాయులు శ్రుతిమించితే రక్తనాళాలు గట్టిపడే ప్రమాదముంది. అంతేకాదు, పిడికిలి బిగువు తగ్గటమూ గుండెజబ్బు ముప్పును సూచించేదే. దెబ్బల వంటివేవీ తగలకపోయినా అకారణంగా గోళ్ల కింద చిన్న చిన్న నల్లటి మచ్చలు ఏర్పడటమూ ప్రమాదకరమైనదే. ఇవి గుండె కవాట పొర ఇన్‌ఫెక్షన్‌కు సంకేతం కావొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని