ఆహారం కలుషితమా?

ఎండకాలంలో ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువ. దీంతో వాంతులు, విరేచనాలు పట్టుకోవచ్చు. కొన్నిసార్లు జ్వరమూ రావొచ్చు. అందువల్ల బయట ఆహారం తినేవారు ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. వంట వండే

Published : 04 May 2021 00:30 IST

ఎండకాలంలో ఆహారం కలుషితమయ్యే ప్రమాదం ఎక్కువ. దీంతో వాంతులు, విరేచనాలు పట్టుకోవచ్చు. కొన్నిసార్లు జ్వరమూ రావొచ్చు. అందువల్ల బయట ఆహారం తినేవారు ఇంకాస్త అప్రమత్తంగా ఉండాలి. వంట వండే చోట్లు, వండే విధానం, వంట పాత్రలు, వంటకు ఉపయోగించే నీరు అన్నీ శుభ్రంగా ఉన్నచోటే భోజనం చేయాలి. బయట కుళాయి నీళ్లు తాగకపోవటం మంచిది. బాగా ఉడికిన ఆహారమే తినాలి. పచ్చివి, సగం ఉడికినవి తీసుకోవద్దు. ఇంట్లో కూడా వీలైనంతవరకు అప్పుడే వండిన ఆహారం తినాలి. బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి పుట్టుకొచ్చే విషతుల్యాలతో ఆహారం కలుషితం అవుతుంది. నిజంగా జబ్బు కలిగించే వైరస్‌లు, బ్యాక్టీరియా ఎప్పుడో చనిపోయి ఉండొచ్చు కూడా. వాంతులు, విరేచనాలు వేధిస్తున్నప్పుడు మెత్తటి కిచిడీ వంటివి కొద్దికొద్దిగా తింటూ తగినంత నీరు తాగుతుండాలి. నీటిలో చిటికెడు ఉప్పు, చారెడు పంచదార కలిపి తాగొచ్చు. ఉప్పు కలిపిన మజ్జిగ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఓరల్‌ డీహైడ్రేషన్‌ సొల్యూషన్‌ పొడులతో పాటు సిద్ధం చేసిన ద్రావణాలు సైతం అందుబాటులో ఉంటున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని