జన్యువులతోనే ఆడవారికి ల్యూపస్‌ ఎక్కువ

ల్యూపస్‌ బారినపడ్డవారిలో ముఖానికి రెండు వైపులా సీతాకోక చిలుక ఆకారంలో దద్దు వస్తుంటుంది. ఒంట్లో ఇతరత్రా ఇబ్బందులూ తలెత్తుతుంటాయి. ల్యూపస్‌ మన రోగనిరోధకశక్తి పొరపాటున మన కణాల మీదే దాడి చేయటం ...

Published : 02 Nov 2021 02:23 IST

ల్యూపస్‌ బారినపడ్డవారిలో ముఖానికి రెండు వైపులా సీతాకోక చిలుక ఆకారంలో దద్దు వస్తుంటుంది. ఒంట్లో ఇతరత్రా ఇబ్బందులూ తలెత్తుతుంటాయి. ల్యూపస్‌ మన రోగనిరోధకశక్తి పొరపాటున మన కణాల మీదే దాడి చేయటం వల్ల తలెత్తే సమస్య. మగవారి కన్నా ఆడవారికి దీని ముప్పు 9 రెట్లు ఎక్కువ. దీనికి కారణం రోగనిరోధక వ్యవస్థలో పాలు పంచుకునే రెండు జన్యువుల్లో తలెత్తే మార్పులేనని తాజా అధ్యయనం పేర్కొంటోంది. ల్యూపస్‌తో బాధపడుతున్న, ల్యూపస్‌ లేనివారిని ఎంచుకొని పరిశోధకులు ఈ జన్యువుల తీరును పరిశీలించారు. వీటిల్లో మార్పుల ఆధారంగా ల్యూపస్‌ ముప్పును అంచనా వేయొచ్చనీ గుర్తించారు. దీని ముప్పు పెరగటానికి దోహదం చేసే జన్యువులు ఆడవారిలోనే ఎక్కువగా ఉంటున్నాయని, అందుకే ల్యూపస్‌ వీరిలో ఎక్కువగా కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని