Weight Loss: బరువు తగ్గాలా!

పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు మనకు ఆరోగ్యాన్నిస్తాయి. ఇలాంటి వాటిలో జామను ముందుగా చెప్పొచ్చు.

Updated : 06 Jun 2021 14:09 IST

పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు, పోషకాలు మనకు ఆరోగ్యాన్నిస్తాయి. ఇలాంటి వాటిలో జామను ముందుగా చెప్పొచ్చు.

పైన ఆకుపచ్చగా... లోన తెలుపు, లేత గులాబీ రంగుల్లో ఆకర్షిస్తూ ఉండే జామ రుచే కాదు.... ఎన్నో పోషకాలనూ ఇస్తుంది. దీంతో కలిగే మరిన్ని ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...
* 100 గ్రా. జామకాయ నుంచి 200 మి.గ్రా. విటమిన్‌-సి లభ్యమవుతుంది.  దీన్ని క్రమం తప్పకుండా ఆహారంలో చేర్చుకుంటే ఇమ్యూనిటీని పెంపొందించుకున్నట్లే.
*జామకాయ తక్కువ ధరలో అందరికీ అందుబాటులో లభిస్తుంది. వందగ్రాముల జామ ముక్కల నుంచి 50 కెలొరీల శక్తి లభిస్తుంది. నెమ్మదిగా అరుగుతుంది.  పీచు ఎక్కువగా ఉండే పండు ఇది. మధుమేహులు కూడా తీసుకోవచ్చు. జీర్ణక్రియ సక్రమంగా సాగేలా చూడటంలో ముందుంటుంది. రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రిస్తుంది.
* గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ పండును క్రమం తప్పకుండా తీసుకుంటే నెలసరి సమయంలో వచ్చే నొప్పి నియంత్రణలో ఉంటుంది.
* జామలోని పొటాషియం, పీచు రక్తపోటును నియంత్రిస్తాయి.
* దీన్ని తింటే కడుపు నిండిన భావన కలిగి చాలాసేపటి వరకు ఆకలి వేయదు. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారికి చక్కటి ఎంపిక.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని