సీతాఫల్‌ సగ్గుబియ్యం ఖీర్‌

సీతాఫలం- రెండు (గుజ్జు తీసి పెట్టుకోవాలి), సగ్గుబియ్యం- అర కప్పు (అరగంట వేడినీటిలో నానబెట్టాలి), పాలు- అర లీటరు,....

Updated : 08 Aug 2021 04:05 IST

కావాల్సినవి: సీతాఫలం- రెండు (గుజ్జు తీసి పెట్టుకోవాలి), సగ్గుబియ్యం- అర కప్పు (అరగంట వేడినీటిలో నానబెట్టాలి), పాలు- అర లీటరు, నెయ్యి- చెంచా, బాదం తరుగు- రెండు పెద్ద చెంచాలు, యాలకుల పొడి- పావు చెంచా, కుంకుమపువ్వు- కొద్దిగా, చక్కెర- నాలుగు పెద్ద చెంచాలు.

తయారీ: పొయ్యి వెలిగించి పాన్‌ పెట్టి నెయ్యి వేయాలి. అది వేడయ్యాక బాదం తరుగు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేసి బాగా కలపాలి. పాలు పోసి మిశ్రమం పూర్తిగా చిక్కగా అయ్యేవరకు ఉడికించి చక్కెర వేసుకోవాలి. ఆ తర్వాత ఇలాచీ పొడి, కుంకుమపువ్వు, సీతాఫలం గుజ్జు ఒకదాని తర్వాత మరొకటి వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు మూడు నిమిషాలపాటు ఉడికించాలి. అంతే తియ్యతియ్యని రుచికరమైన సీతాఫల్‌ సాబుదానా రెడీ!

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని