Updated : 02/05/2020 00:19 IST

ఈ వేళలో నీవు..!

వర్చువల్‌ ప్రేమలో..

పరిచయం ఎక్కడైనా.. ఎలాగైనా.. మొదటిసారి కలుద్దాం అనుకున్నప్పుడు ఆ గుండెల్లో గుబులు మాటల్లో చెప్పలేనిది. ఇప్పుడైతే లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో కలవడం కుదరదు కదా!! మరైతే.. ఎలా? అనుకోవడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే... వర్చువల్‌ మీటింగ్‌లు, ఆన్‌లైన్‌ చాటింగ్‌లు ఉన్నాయ్‌గా! ఇంకెందుకు ఆలస్యం? హాయ్‌!! చెప్పేందుకు సిద్ధం అయిపోతున్నారా? ఒక్క నిమిషం ఆగండి.. ఇవిగోండి ఈ చిట్కాల్ని ఫాలో అయిపోండి!!

చిరునవ్వు చెరగనివ్వొద్దు

అందం.. ఆభరణాల కంటే ముఖంపై చిరునవ్వే చెరగని అలంకరణ అని మర్చిపోవద్ధు కొన్ని మైళ్ల దూరాన్ని దగ్గరగా మార్చేస్తుంది. అందుకే చక్కని చిరునవ్వుతో మీ పలకరింపులు మొదలవ్వాలి.

మీరు మీలా ఉండండి

మొదటి చూపులో మీలో కనిపించాల్సింది అందం ఒక్కటే కాదు. ఆత్మవిశ్వాసం కూడా. అందుకే మీకు మీరు ఎలా నచ్చుతారో అలానే రెడీ అవ్వండి. మరీ ఎక్కువ మేకప్‌ చేసుకోవద్ధు అలాగే, ఇంట్లో ఉండే మాట్లాడాలి కాబట్టి మీకు ఇష్టమైన చోటు ఎంచుకుని అక్కడ కూర్చునే మాట్లాడండి. వెనక కనిపించే బ్యాక్‌గ్రౌండ్‌ మీ అభిరుచుల్ని స్పష్టంగా తెలిపేలా ఉంటే మంచిది. ఉదాహరణకు మీ గది నుంచి మాట్లాడుతున్నట్లయితే మొత్తం సర్దేసి ఉండేలా జాగ్రత్త పడాలి. అప్పుడు మీరో మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అని అర్థం అవుతుంది. కలిసేది, మాట్లాడేది ఆన్‌లైన్‌లో అందుకే మీ గదిలో సరైన వెలుతురు ఉండేలా చూసుకోవాలి.

టెన్షన్‌ వద్దు బాసూ!

ఒకరినొకరు అంచనా వేసుకోవడానికి కాదు వర్చువల్‌గా మాట్లాడుకునేది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి.. అభిరుచులు తెలుసుకోవడానికి. అందుకే గాబరా పడొద్ధు పోటీ పరీక్షలా ఫీలవ్వొద్ధు ముఖాముఖిగా మాట్లాడడం ఇదే మొదటిసారైతే వర్చువల్‌గా కలిసే ముందు కాసేపు ధ్యానం చేయండి. దీంతో ఒత్తిడిని నియంత్రించొచ్ఛు

ముగింపూ ముఖ్యమే!

వర్చువల్‌ మీటింగ్‌లో ముగింపు చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ముగింపే తదుపరి సంభాషణలకు నాంది. అందుకే మీ మాటల్లో నమ్మకం, నిజాయతీ ఉండాలి. మొదటి మీటింగ్‌లోనే ఓ తెరిచిన పుస్తకంలా అన్నీ చెప్పేద్దాం అనుకోవద్ధు కొన్నింటిని దాటవేయొచ్ఛు అప్పుడే ఎదుటివారికి మరికొన్ని చదవాల్సిన పేజీలు ఇంకా మిగిలే ఉంటాయి.

ఇలా మొదలెట్టండిక

ఎదుటి వారి క్షేమసమాచారాలతో మాట కలపండి. ఒకరు మాట్లాడుతుంటే మరొకరు వినాలి. ఒకరి మాటని మరొకరు గౌరవించాలి. ఇష్టాలేంటో తెలుసుకుని వాటి గురించి మాట్లాడండి. సినిమాలు, పుస్తకాలు, ఆహారం.. అభిరుచులు ఏవైనా దాపరికం లేకుండా వ్యక్తం చేయాలి. మొదటి పరిచయంలోనే ఎదుటి వారి గురించి పూర్తిగా తెలుసుకుందాం అనే ఆత్రుత వద్ధు వర్చువల్‌ మీటింగ్‌ ముందు మీతో మీరే ఒకసారి మాట్లాడుకుని మీ బాడీ లాంగ్వేజీ ఎలా ఉందో చెక్‌ చేసుకుంటే మంచిది.


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని