Published : 28/03/2020 04:07 IST

చేతులు శుభ్రం బాస్‌!!

వైరస్‌ ఛాలెంజ్‌

సోషల్‌ మీడియాలో ఏదో ఒక ఛాలెంజ్‌ ఎప్పుడూ వైరల్‌ అవుతూనే ఉంటుంది. రకరకాల వీడియోలు, పోస్ట్‌లు ట్రెండింగ్‌లో నిలుస్తాయి. అలాగే ఇప్పుడు ఓ ఛాలెంజ్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. అదే ట్రెండింగ్‌లో ఉన్న ‘సేఫ్‌ హ్యాండ్స్‌ ఛాలెంజ్‌’. ఇప్పుడిది తెగ వైరల్‌ అవుతోంది. కరోనా వైరస్‌ బారిన పడకుండా చేతులను ఎలా శుభ్రం చేసుకోవాలో వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించడమే దీని    ముఖ్య ఉద్దేశం. సినీతారలు దీపికా పదుకొణె, అనుష్క శర్మ, ప్రియాంక చోప్రాలతోపాటు సచిన్‌ తెందూల్కర్‌, పీవీ సింధూ.. ఇంకా ఎంతో మంది సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్‌లో పాల్గొని అప్రమత్తం చేస్తున్నారు. సంబంధిత వీడియోలను వారివారి సామాజిక మాధ్యమాల్లో ఉంచుతూ మరొకరికి ఛాలెంజ్‌ విసురుతున్నారు. మరింకెందుకాలస్యం మీరూ ఈ ఛాలెంజ్‌లో పాల్గొని వీడియోతో మీ స్నేహితులకు ఛాలెంజ్‌ విసరండి. చేతులు పరిశుభ్రంగా ఉంచుకొని కరోనా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోండి.


Advertisement


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని