ఆ లక్షణాలుంటే ‘ఏఐ’ చెక్‌అప్‌

బయటికి వెళ్లొస్తే అదే ఆలోచన.. ఇంట్లో వాళ్లు దగ్గితే ఆందోళన.. కాస్త నలతగా కనిపిస్తే తెలియని భయం.. కొంచెం జ్వరంగా అనిపిస్తే బెంబేలెత్తిపోవడం..

Published : 28 Mar 2020 04:08 IST

స్వీయ పరీక్ష

బయటికి వెళ్లొస్తే అదే ఆలోచన.. ఇంట్లో వాళ్లు దగ్గితే ఆందోళన.. కాస్త నలతగా కనిపిస్తే తెలియని భయం.. కొంచెం జ్వరంగా అనిపిస్తే బెంబేలెత్తిపోవడం.. ఇప్పుడు అందరి పరిస్థితి ఇంచుమించు ఇదే. మరైతే, కరోనాపై బేసిక్‌ అవగాహన పెంచుకుని.. వ్యాధి లక్షణాల ఆధారంగా మీరు ఉన్న స్థితిని అంచనా వేసుకుంటే? అదెలాగంటారా? ఇదిగోండి.. NHWN యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోండి. దీంట్లో కరోనాపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకునేలా ప్రత్యేక విభాగాన్ని ‘సంజీవని’ పేరుతో అందుబాటులో ఉంది. యాప్‌ని ఓపెన్‌ చేశాక ఫోన్‌ నెంబర్‌తో లాగిన్‌ అవ్వొచ్చు. హోం పేజీలో ‘కొవిడ్‌-19’ పేరుతో మెనూ కనిపిస్తుంది. దాన్ని ట్యాప్‌ చేస్తే ‘సంజీవన్‌ కొవిడ్‌19 రిస్క్‌ అసెసర్‌’ ఓపెన్‌ అవుతుంది. మీ అంతట మీరుగా ఓ మారు చెక్‌ చేసుకోవాలనుకుంటే టెస్ట్‌ని స్టార్ట్‌ చేయొచ్చు. అడిగే అన్ని ప్రశ్నలకు ‘అవును, కాదు’ అనే సమాధానాలు చెబుతూ వెళ్లాలి. టెస్ట్‌ ముగిశాక అన్ని వివరాల్ని కృత్రిమ మేధస్సుతో ప్రాసెస్‌ చేసి టెక్ట్స్‌ మెసేజ్‌ రూపంలో మీకో వెబ్‌ లింక్‌ పంపుతుంది. దానిపై క్లిక్‌ చేస్తే మీ రిపోర్టు డౌన్‌లోడ్‌ అవుతుంది. ఓపెన్‌ చేసి ప్రాథమికంగా మీరే స్థితిలో ఉన్నారో అంచనాకి రావొచ్చు. కుటుంబం మొత్తానికి సంజీవన్‌ పరీక్ష చేసుకునే వెసులుబాటు ఉంది. అంతేకాదు.. రిపోర్టులో కరోనాకి సంబంధించిన మొత్తం వివరాల్ని పొందుపరిచారు. క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేయడం ద్వారా వివరాల్ని తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్‌, యాపిల్‌ స్టోర్‌ల్లోకి వెళ్లి యాప్‌ని ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు.
డౌన్‌లోడ్‌ లింక్‌: https://tinyurl.com/NIHWNgoogle


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని