ఉతారేంగీ క్యా?

నేను ముంబయిలోని ఓ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో కొత్తగా చేరిన రోజులవి. అక్కడ జనం హిందీ లేదా ఇంగ్లిష్‌లో మాట్లాడేవాళ్లు. నేను ఫర్వాలేదుగానీ

Published : 07 Nov 2020 01:12 IST

కాలేజీ డైరీ

నేను ముంబయిలోని ఓ ఫిల్మ్‌ ఇనిస్టిట్యూట్‌లో కొత్తగా చేరిన రోజులవి. అక్కడ జనం హిందీ లేదా ఇంగ్లిష్‌లో మాట్లాడేవాళ్లు. నేను ఫర్వాలేదుగానీ నా ఫ్రెండ్‌ శ్రీరామ్‌కి బొత్తిగా హిందీ ముక్క రాదు. కష్టపడి ఒకట్రెండు మాటలు చెప్పేవాడు. ఓరోజు లోకల్‌ బస్‌లో ఇద్దరం ఇనిస్టిట్యూట్‌కి బయల్దేరాం. జనం ఎక్కువగా ఉండటంతో సీటు దొరక్క డోరు దగ్గర నిల్చున్నాం. కాసేపయ్యాక ఒక స్టాప్‌లో బస్‌ ఆగింది. ఒకమ్మాయి దిగడానికొస్తుంటే మావాడు ‘ఉతారేంగీ క్యా?’ అన్నాడు. తను మావాడ్ని గుడ్లురిమి చూస్తూ దాదాపు కొట్టినంత పని చేసింది. వెంటనే తనకి నేను సారీతో సర్దిచెప్ఫా అయినా మమ్మల్ని తిట్టుకుంటూ వెళ్లిపోయింది. మావాడి ఉద్దేశం ‘బస్‌ దిగుతారా? పక్కకు జరగమంటారా?’ అని. కానీ వాడిన పదం ఉత్రేంగీ క్యాకి బదులు ఉతారేంగీ. క్లాసుకు వెళ్లగానే జరిగింది అందరికీ చెబితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ఉతారేంగీకి అర్థం తెలుసుకొని మావాడూ మాతో శ్రుతి కలిపాడు. - ఎస్‌.పవన్‌ రావు, ఈమెయిల్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని