కండరాలకు అండదండలు!

కండల్ని కొండల్లా పెంచేయాలన్నది చాలామంది కుర్రకారు తాపత్రయం. ఈ ధ్యాసలో పడి అదేపనిగా వ్యాయామాలు చేస్తుంటే కండరాల నొప్పులు, పట్టేయడాలూ తప్పవు

Published : 28 Nov 2020 00:37 IST

ఫిట్‌నెస్‌ మంత్ర

కండల్ని కొండల్లా పెంచేయాలన్నది చాలామంది కుర్రకారు తాపత్రయం. ఈ ధ్యాసలో పడి అదేపనిగా వ్యాయామాలు చేస్తుంటే కండరాల నొప్పులు, పట్టేయడాలూ తప్పవు. అందుకే వాటికి విశ్రాంతినివ్వడం అవసరం. దీనికోసం ఫోమ్‌ రోలర్‌ వర్కవుట్‌ మంచి వ్యాయామం.
ఎలా చేయాలి?
చిత్రంలో చూపించినట్టు ఒక్కొక్క మజిల్‌ గ్రూపు మీద ఫోమ్‌ రోలర్‌ని ఒకట్రెండు నిమిషాలు ఆడిస్తూ తర్వాత సమయం పెంచుకుంటూ వెళ్లాలి. మొదట్లో తక్కువ ఒత్తిడి కలిగించేలా చేస్తూ ఆపై ఒత్తిడి పెంచాలి. రోలింగ్‌ చేసేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోనూ కేవలం కండరాలపైనే ఒత్తిడి కలిగేలా చేయాలి. రోలింగ్‌ ఎంత నెమ్మదిగా చేస్తే అంత హాయిగా ఉంటుంది. ఫోమ్‌ రోలర్‌ని బోన్స్‌, జాయింట్లపై అసలు ఆనించకూడదు.    
ఉపయోగాలు
* కండరాల ఒత్తిడి, నొప్పి తగ్గుతాయి.
* శరీరంపై నియంత్రణ ఉంటుంది. గాయాలు కావు.
* ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.
* కండరాల కదలికల సామర్థ్యం పెరుగుతుంది.
* రక్తప్రసరణ సాఫీగా ఉంటుంది.
* అంతర కండరాలు ఉత్తేజితం అవుతాయి.
* ఫోమ్‌రోలర్‌.. ప్రి, పోస్ట్‌ వర్కవుట్‌గా కూడా పనికొస్తుంది.

- బాబీ, ఫిట్‌నెస్‌ ట్రైనర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని