నిన్ను నీవు.. గెలవాలి

ఇతరుల విజయాలు మనలో స్ఫూర్తి రగిలిస్తాయి. మనల్నీ ఊరిస్తాయి. కానీ ఆ ఛాయాఛత్రం కిందే ఉంటే మనం ముందుకెళ్లలేం. అందుకిలా ఆచరణ మొదలవ్వాలి.

Published : 13 Mar 2021 00:18 IST

సక్సెస్‌ మంత్ర

ఇతరుల విజయాలు మనలో స్ఫూర్తి రగిలిస్తాయి. మనల్నీ ఊరిస్తాయి. కానీ ఆ ఛాయాఛత్రం కిందే ఉంటే మనం ముందుకెళ్లలేం. అందుకిలా ఆచరణ మొదలవ్వాలి.
వెన్నాడే నీడ: కష్టపడితే ఆలస్యంగా అయినా విజయం దక్కడం ఖాయం. ఈ క్రమంలో నిన్ను నీవు కోల్పోవద్దు. మన జీవితాంతం తోడుండేది మన నీడ ఒక్కటే. దీన్నే ఆత్మ, హృదయం, మనస్సాక్షి.. ఏదైనా అనుకోవచ్చు. ఆత్మసాక్షికి నచ్చనిది ఏదీ చేయొద్దు.
నిన్ను నీవు పరీక్షించుకో: ఇతరుల అడుగుజాడల్లో వెళ్లిన ప్రతి ఒక్కరికీ విజయం సొంతం అవుతుందని చెప్పలేం. ఒకరికి వర్కవుట్‌ అయింది మరొకరికి కాకపోవచ్చు. విజేతల నుంచి స్ఫూర్తిని మాత్రమే తీసుకోవాలి. సొంత దారి ఎంచుకోవాలి.  
సరైన ఎంపిక: మనమేంటో, మన ప్రతిభ ఏంటో మనకే తెలుస్తుంది. మనకు ఏది నప్పుతుందో మనమే తేల్చుకోగలుగుతాం. ఉదాహరణకు మన అన్నయ్య లేదా బాబాయ్‌ ఏదో ఒక వృత్తి, రంగం ఎంచుకుంటాడు. విజయం సాధిస్తాడు. మనమూ మన ప్రతిభకు నప్పే, సరిపోయే రంగమే ఎంచుకోవాలి.
ఆత్మవిశ్వాసంతో: మనం ఎక్కడికెళ్లినా మన నీడ వెంటాడుతూనే ఉంటుంది. మన విజయాలు, అపజయాలు ఎత్తుపల్లాలు, కష్టసుఖాలు.. మంచీచెడూ ప్రతీదీ మన సొంతమే. కష్టాల నుంచే రాటుదేలుతాం. సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో పట్టు సాధిస్తాం. కొత్త ఆలోచలొస్తాయి. మనకు మనమే స్ఫూర్తిదాతలుగా మారతాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని