బరువులెత్తకుండానే కండలు

కండలు పెంచాలనే ఉంటుంది.. సిక్స్‌ప్యాక్‌తో అదరగొట్టాలనే అనిపిస్తుంది. కానీ బరువులు ఎత్తాలంటేనే బద్ధకం. చాలామంది కుర్రాళ్లది ఇదీ వరుస. దానికి ఇవీ ప్రత్యామ్నాయాలంటున్నారు నిపుణులు.

Updated : 04 Dec 2021 05:18 IST

కండలు పెంచాలనే ఉంటుంది.. సిక్స్‌ప్యాక్‌తో అదరగొట్టాలనే అనిపిస్తుంది. కానీ బరువులు ఎత్తాలంటేనే బద్ధకం. చాలామంది కుర్రాళ్లది ఇదీ వరుస. దానికి ఇవీ ప్రత్యామ్నాయాలంటున్నారు నిపుణులు.

* పుషప్స్‌: శరీర బరువును ఉపయోగించుకొని కండలు పెంచుకునే తేలికైన వ్యాయామం ఇది. వీటితో అప్పర్‌ బాడీలోని భుజాలు, వీపు, ఛాతీ కండరాలు దృఢమవుతాయి. ఎముకల సాంద్రత మెరుగవుతుంది. ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది.

* డిప్స్‌: తక్కువ సమయంలోనే కండరగండడు అనిపించుకోవాలంటే ప్యారలల్‌ బార్స్‌ మీద చేసే డిప్స్‌ అనువైన వర్కవుట్‌. కానీ ఇది కొంచెం కష్టసాధ్యమైన కసరత్తే. చేస్తే.. ఛాతీ, వీపు, భుజాలు బలంగా తయారవుతాయి.

* పులప్స్‌: మొత్తం శరీరంపై ప్రభావం ఉంటుంది. నడుము నుంచి భుజాల దాకా వీ ఆకారంలో కండర పుష్టి కనపడాలంటే దీన్ని ఎంచుకోవచ్చు. ఈ వ్యాయామంతో కోర్‌ మజిల్స్‌ దృఢమవుతాయి.

* బర్పీస్‌: కాలి నుంచి మెడ వరకు.. అన్ని కండరాల్లో కదలిక రావాలంటే బర్పీస్‌ మంచి వ్యాయామం. తరచూ చేస్తుంటే శరీరంపై స్థిరత్వం సాధించగలుగుతాం.

* స్క్వాట్స్‌: లోయర్‌ బాడీ మంచి ఆకృతి రావడానికి ఈ వర్కవుట్‌ ఉపయోపడుతుంది. స్నాయువు కండరాలు దృఢమవుతాయి.

* బాక్స్‌ జంప్స్‌: బరువు, శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు తగ్గిస్తుందీ వ్యాయామం. కాలి పిక్కలతోపాటు లోయర్‌ బాడీ దృఢమవుతుంది. ఈ కసరత్తు కోసం శరీర బరువు ఆపేలా గట్టి బాక్స్‌ ఎంచుకోవాలి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని