Ramoji film city: రా రమ్మంటున్న పర్యాటక లోకం

ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ఈనెల 8వ తేదీ నుంచి పర్యాటకుల సందర్శన పునఃప్రారంభం కాబోతోంది. పర్యాటక స్వర్గధామం

Updated : 05 Oct 2021 07:16 IST

సందర్శకులకు రామోజీ ఫిల్మ్‌సిటీ స్వాగతం  
ఈ నెల 8 నుంచి పునఃప్రారంభం

రామోజీ ఫిల్మ్‌సిటీ, న్యూస్‌టుడే: ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ పర్యాటకులకు స్వాగతం పలుకుతోంది. ఈనెల 8వ తేదీ నుంచి పర్యాటకుల సందర్శన పునఃప్రారంభం కాబోతోంది. పర్యాటక స్వర్గధామం ఫిల్మ్‌సిటీలో వినోదాలను ఆస్వాదిస్తూ విహారానుభూతిని సొంతం చేసుకోవడానికి సకుటుంబ సమేతంగా విచ్చేసి ఆనందించే అవకాశం కల్పిస్తున్నారు. రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శన పర్యాటకులకు మరుపురాని మధుర జ్ఞాపకంగా మిగిలేలా అడుగడుగునా అనేక విశేషాలు ఆకట్టుకుంటాయి.

కళ్లారా వీక్షించొచ్చు..

రామోజీ ఫిల్మ్‌సిటీలోకి అడుగు పెట్టే పర్యాటకులకు స్వాగత వేడుక, బాహుబలి సినిమా చిత్రీకరణ జరిగిన సెట్‌ సందర్శన, యురేకా అందాలు, షాపింగ్‌ అనుభూతి, రామోజీ మూవీ మ్యాజిక్‌, ఫిల్మ్‌సిటీ టూర్‌, పక్షుల కిలకిలారవాల బర్డ్‌పార్క్‌, అందాల సీతాకోక చిలుకల పార్కు.. ప్రత్యేక షోలు, చిన్న, పెద్దలను ఆకట్టుకొనే రైడ్స్‌, చిన్నారులకు ఫండుస్థాన్‌.. ఇలా ఒక్కటేమిటి.. ఆబాలగోపాలాన్నీ అలరించేందుకు ఎన్నెన్నో విశేషాలున్నాయి. అను క్షణం ఆనంద వీక్షణాలను ఆస్వాదిస్తూ.. రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శనతో ప్రతి ఒక్కరూ ఆనంద తీరాలను చేరవచ్చు. ఫిల్మ్‌సిటీ సందర్శనతోపాటు విడిది ప్యాకేజీలు కూడా అందుబాటులో ఉన్నాయి.


ఫిల్మ్‌సిటీ సందర్శించాలంటే..

రామోజీ ఫిల్మ్‌సిటీ సందర్శించాలనుకునే వారు వివరాలకు టోల్‌ ఫ్రీ నంబరు 1800 120 2999లో, www.ramojifilmcity.com వెబ్‌సైట్‌లో సంప్రదించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని