AP News: కోటి ఆశలు... మూడు ముక్కలాటలు

2014 సెప్టెంబరు 3: రాజధాని ప్రాంతాన్ని నిర్ణయిస్తూ అసెంబ్లీ తీర్మానం ..డిసెంబరు 23:  ఏపీసీఆర్‌డీఏ చట్టాన్ని ఆమోదించిన శాసనసభ..

Updated : 10 Aug 2022 15:54 IST

శంకుస్థాపన నుంచి ఉపసంహరణ వరకు అన్నీ సంచలనమే

2014 సెప్టెంబరు 3: రాజధాని ప్రాంతాన్ని నిర్ణయిస్తూ అసెంబ్లీ తీర్మానం

డిసెంబరు 23:  ఏపీసీఆర్‌డీఏ చట్టాన్ని ఆమోదించిన శాసనసభ

డిసెంబరు 30:  సీఆర్‌డీఏ అథారిటీ ఏర్పాటు. 7,317 చ.కి.మీ. విస్తీర్ణంలో కేపిటల్‌ రీజియన్‌ని, 217.23 చ.కి.మీ.లలో రాజధాని నగరాన్ని నోటిఫై చేసిన ప్రభుత్వం

2015 ఫిబ్రవరి 28: కేవలం రెండు నెలల వ్యవధిలో 32,469 ఎకరాలు ఇచ్చిన 20,510 మంది రైతులు

అక్టోబరు 22: ఉద్ధండరాయునిపాలెం వద్ద రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన

2016 ఏప్రిల్‌ 25: వెలగపూడి సచివాలయం ప్రారంభం.

జూన్‌ 6: సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు లాటరీ ద్వారా స్థలాల కేటాయింపు ప్రక్రియ నేలపాడు గ్రామంతో ప్రారంభం

అక్టోబరు 28: పరిపాలన నగరానికి అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ శంకుస్థాపన

2017 మార్చి 2:  వెలగపూడిలో అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

డిసెంబరు 27: రాజధాని నగరం అమరావతిని సందర్శించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

2019 ఫిబ్రవరి 3: జ్యుడిషియల్‌ కాంప్లెక్స్‌  ప్రారంభోత్సవం. ముఖ్య అతిథిగా హాజరైన అప్పటి సీజేఐ జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌

డిసెంబరు 17: మూడు రాజధానుల్ని ప్రతిపాదిస్తూ అసెంబ్లీలో సీఎం జగన్‌ ప్రకటన

డిసెంబరు 18: సీఎం ప్రకటనకు నిరసనగా ఉద్యమం ప్రారంభించిన రాజధాని రైతులు

2020 జనవరి 3: మూడు రాజధానుల్ని సిఫారసు చేస్తూ బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్‌ నివేదిక

జనవరి 20: నిరసనగా అసెంబ్లీ వద్దకు చేరుకున్న రైతులపై లాఠీఛార్జి

జనవరి 20: మూడు రాజధానులు, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లుల్ని ఆమోదించిన అసెంబ్లీ

ఫిబ్రవరి 10: ప్రొసీజర్‌ ఫాలో అవ్వనందున బిల్లుల్ని సెలక్ట్‌ కమిటీకి పంపలేనంటూ మండలి ఛైర్మన్‌కు తిప్పి పంపిన ఇన్‌ఛార్జి సెక్రటరీ

జూన్‌ 16: ఆ రెండు బిల్లుల్ని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన ప్రభుత్వం

జూన్‌ 17: కౌన్సిల్‌లో తెదేపాఆందోళనతో చర్చకు నోచుకోని బిల్లులు

జులై 31:  బిల్లులకు ఆమోదముద్ర వేసిన గవర్నర్‌

2021 నవంబరు 1: తుళ్లూరు నుంచి తిరుమలకు పాదయాత్ర ప్రారంభించిన రైతులు

నవంబరు 22: కొత్త బిల్లులు తెస్తామంటూ.. మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు చట్టాల్ని ఉపసంహరిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టిన  ప్రభుత్వం

- ఈనాడు, అమరావతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని