AP New Districts: రాయలసీమకు సముద్రతీరం!

కొత్త జిల్లాల ఏర్పాటుతో కోస్తా, సీమ జిల్లాల లెక్కలూ మారనున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇప్పటివరకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 9 జిల్లాలను కోస్తా ప్రాంతంగా... కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురంలను

Updated : 27 Jan 2022 10:58 IST

రాష్ట్రంలో  మారనున్న వివిధ జిల్లాల లెక్కలు
12 తీరంలో, 2 ఏజెన్సీలో, 12 మైదాన ప్రాంతంలో...

ఈనాడు, అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటుతో కోస్తా, సీమ జిల్లాల లెక్కలూ మారనున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇప్పటివరకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 9 జిల్లాలను కోస్తా ప్రాంతంగా... కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురంలను రాయలసీమగా పరిగణిస్తున్నారు. 26 జిల్లాల పునర్విభజనతో కోస్తా జిల్లాల సంఖ్య 12 కానుంది. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో రెండు, మైదాన ప్రాంతంలో 12 జిల్లాలు రానున్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని తిరుపతి కేంద్రంగా ఏర్పడే శ్రీబాలాజీ జిల్లాతో కలపడంతో రాయలసీమకు తీరప్రాంతం వచ్చినట్లయింది. ఇప్పటివరకు ప్రత్యేకంగా ఏజెన్సీ జిల్లాలనేవి లేవు. ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో కొంత భాగాన్ని ఏజెన్సీ ప్రాంతాలుగానే పిలిచేవారు. ఇప్పుడు పాడేరు, పార్వతీపురం కేంద్రాలుగా రెండు కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. రాయలసీమలో జిల్లాల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. కొత్తగా నంద్యాల, శ్రీసత్యసాయి, శ్రీబాలాజీ, అన్నమయ్య జిల్లాలు ఏర్పాటవుతున్నాయి.

కోస్తా: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ (అమలాపురం), పశ్చిమగోదావరి (భీమవరం), కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీబాలాజీ (తిరుపతి).

ఏజెన్సీ: మన్యం (పార్వతీపురం), అల్లూరి సీతారామరాజు (పాడేరు).

మైదాన ప్రాంత జిల్లాలు: తూర్పుగోదావరి (రాజమహేంద్రవరం), ఏలూరు, ఎన్టీఆర్‌ (విజయవాడ), గుంటూరు, పల్నాడు (నరసరావుపేట), నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి (పుట్టపర్తి), వైఎస్సార్‌ కడప, అన్నమయ్య (రాయచోటి), చిత్తూరు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని