పాక్‌ గెలుపుపై సంబరాలు.. విద్యార్థుల మీద ‘ఉపా’ కేసులు

ఇటీవల జరిగిన భారత్‌-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో పాక్‌ గెలుపు సాధించడాన్ని ఆస్వాదిస్తూ సంబరాలు చేసుకున్న వైద్య విద్యార్థులపై జమ్మూ-కశ్మీర్‌ పోలీసులు

Updated : 27 Oct 2021 10:22 IST

కశ్మీర్‌లో కొత్త వివాదం

రాజస్థాన్‌లో ఉపాధ్యాయిని తొలగింపు

శ్రీనగర్‌, జైపుర్‌: ఇటీవల జరిగిన భారత్‌-పాక్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో పాక్‌ గెలుపు సాధించడాన్ని ఆస్వాదిస్తూ సంబరాలు చేసుకున్న వైద్య విద్యార్థులపై జమ్మూ-కశ్మీర్‌ పోలీసులు రెండు ఠాణాల పరిధిలో కేసులు నమోదు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) కింద వీరిపై అభియోగాలు మోపారు. పాక్‌ విజయంపై కశ్మీర్‌ లోయలో పలుచోట్ల విద్యార్థులు కేరింతలు కొడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో తిరుగుతున్నాయి. మానవతా దృక్పథంతో విద్యార్థులపై కఠినమైన ఉపా కేసుల్ని ఉపసంహరించుకోవాలని లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను జమ్మూ-కశ్మీర్‌ విద్యార్థుల సంఘం కోరింది. అటు రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయురాలు ఇదే అంశంపై ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వచ్చింది. పాక్‌ విజయాన్ని ప్రస్తావిస్తూ ‘మనం గెలిచాం’ అనే అర్థంతో వాట్సప్‌లో ఆమె స్టేటస్‌ పెట్టారు. పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని