AP News: ట్విటర్‌లో విజయసాయి, రఘురామ వాగ్బాణాలు

ఎంపీలు విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణరాజు మధ్య గురువారం ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధం నడిచింది. ‘జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా! ఏదో ఆస్తినో (ప్రాపర్టీనో),

Updated : 21 Jan 2022 09:03 IST

ఈనాడు-అమరావతి: ఎంపీలు విజయసాయిరెడ్డి, రఘురామకృష్ణరాజు మధ్య గురువారం ట్విటర్‌ వేదికగా మాటల యుద్ధం నడిచింది. ‘జీవితాన్ని రొచ్చు చేసుకున్నావు కదా రాజా! ఏదో ఆస్తినో (ప్రాపర్టీనో), వాహనాలనో అద్దెకు ఇచ్చినట్లు నిన్ను నువ్వే బాడుగకు ఇచ్చుకుని పెయిడ్‌ మైక్‌ అయ్యావు. లెక్క పంపిస్తే ట్వీట్లు, స్టేట్‌మెంట్లు ఏదైనా చేస్తావు. ఇంత నీచపు జీవితం భారంగా లేదూ? గెలిపించిన ప్రజలను తాకట్టు పెట్టేశావు కదా!’ అని విజయసాయి ట్వీట్‌ చేశారు. ‘అవునా? నా జీవితం నీకు, ఏ1కు భారంగా ఉందనే కదా నన్ను కడతేర్చాలనుకున్నారు. పాపం వివేకానందరెడ్డిలా! ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి సొమ్ములు దోచేస్తున్న మిమ్మల్ని రొచ్చులో తొక్కే రోజు దగ్గర పడింది మిస్టర్‌ ఏ2..!’ అని రఘురామకృష్ణరాజు సమాధానమిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని