తెలుగు రాష్ట్రాల్లో మరో 150 శాఖలు: ముత్తూట్‌ మినీ ఫైనాన్షియర్స్‌

బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ముత్తూట్‌ మినీ ఫైనాన్షియర్స్‌, దేశవ్యాప్తంగా కొత్త శాఖలను పెద్దఎత్తున ఏర్పాటు చేయనుంది. తద్వారా ఈ ఏడాదిలో 1000 శాఖలకు చేరుకోనున్నట్లు ముత్తూట్‌ మినీ ఫైనాన్షియర్స్‌ ప్రకటించింది.

Updated : 22 Jan 2022 14:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: బ్యాంకింగేతర ఆర్థిక సేవల సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ) ముత్తూట్‌ మినీ ఫైనాన్షియర్స్‌, దేశవ్యాప్తంగా కొత్త శాఖలను పెద్దఎత్తున ఏర్పాటు చేయనుంది. తద్వారా ఈ ఏడాదిలో 1000 శాఖలకు చేరుకోనున్నట్లు ముత్తూట్‌ మినీ ఫైనాన్షియర్స్‌ ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 150 కొత్త శాఖలు ఏర్పాటు చేస్తామని పేర్కొంది. దీనివల్ల తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 600 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించింది. కాకినాడ, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, కామవరపుకోట, దేవరపల్లిలో కొత్త శాఖలను ప్రారంభించినట్లు ముత్తూట్‌ మినీ ఫైనాన్షియర్స్‌ ఎండీ మాథ్యూ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు