SBI Services: ఎస్‌బీఐ అలర్ట్‌.. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలకు అంతరాయం

ఎస్‌బీఐకి చెందిన ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు శనివారం (జనవరి 22) కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నాయి. ఈ

Published : 21 Jan 2022 19:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (State bank of India- SBI) వినియోగదారులకు ముఖ్య గమనిక. ఎస్‌బీఐకి చెందిన ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌ సేవలు శనివారం (జనవరి 22) కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నాయి. ఈ మేరకు ఆ బ్యాంక్‌ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

‘‘టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియలో భాగంగా జనవరి 22 ఉదయం 2 గంటల నుంచి ఉదయం 8.30 గంటల వరకు సేవలకు అంతరాయం ఏర్పడనుంది. ఈ సమయంలో ఎస్‌బీఐ ఇంటర్నెట్‌ బ్యాకింగ్‌, యోనో, యోనో లైట్‌, యోనో బిజినెస్‌, యూపీఐ సేవలు పనిచేయవు’’ అని ఎస్‌బీఐ తన అధికారిక ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది.

గతేడాది డిసెంబర్‌ నెలలో సైతం ఇదే తరహాలో టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియను ఎస్‌బీఐ చేపట్టింది. కాగా.. అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు దేశవ్యాప్తంగా 22 వేల శాఖలు, 57,889 ఏటీఎం కేంద్రాలు ఉన్నాయి. మెట్రో నగరాల నుంచి గ్రామీణ స్థాయి వరకు ప్రజలకు సేవలందిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని