Forex reserves: తగ్గిన విదేశీ మారకపు నిల్వలు.. 600బిలియన్‌ డాలర్ల కిందకు

మన దేశ విదేశీ మారకపు నిల్వలు (ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ రిజర్వులు) అంతకంతకూ తరగిపోతున్నాయి. మే 13వ తేదీతో ముగిసిన వారంలో ఈ నిల్వలు 2.676 బిలియన్‌

Published : 21 May 2022 13:38 IST

ముంబయి: మన దేశ విదేశీ మారకపు నిల్వలు (ఫారిన్‌ ఎక్స్ఛేంజ్‌ రిజర్వులు) అంతకంతకూ తరగిపోతున్నాయి. మే 13వ తేదీతో ముగిసిన వారంలో ఈ నిల్వలు 2.676 బిలియన్‌ డాలర్లు తగ్గి 593.279 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ మేరకు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) గణాంకాలు వెల్లడించాయి.

విదేశీ మారకపు నిల్వల్లో కీలకమైన విదేశీ కరెన్సీ ఆస్తులు, పసిడి నిల్వలు తగ్గడం ఫారెక్స్‌ రిజర్వులు తగ్గడానికి ప్రధాన కారణమని ఆర్‌బీఐ వెల్లడించింది. మార్చి 13తో ముగిసిన వారంలో విదేశీ కరెన్సీ ఆస్తులు 1.302 బిలియన్‌ డాలర్లు తగ్గి 529.554 బిలియన్ డాలర్లకు దిగొచ్చాయి. అలాగే పసిడి నిల్వలు 1.169 బిలియన్‌ డాలర్లు తగ్గి 40.57 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి.

అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్‌) వద్ద స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ (ప్రత్యేక ఉపసంహరణ హక్కులు) 165 మిలియన్‌ డాలర్లు తగ్గి 18.204 బిలియన్‌ డాలర్లుగా నమోదైనట్లు ఆర్‌బీఐ డేటా తెలిపింది. ఐఎంఎఫ్‌ వద్ద నిల్వల పొజిషన్‌ కూడా 39 మిలియన్‌ డాలర్లు కుంగి 4.951 బిలియన్‌ డాలర్లుగా ఉంది. అంతకుముందు మే 6వ తేదీతో ముగిసిన వారంలోనూ విదేశీ మారకపు నిల్వలు 1.774 బిలియన్‌ డాలర్లు తగ్గాయి. ఫారెక్స్‌ నిల్వలు తగ్గడం వరుసగా ఇది తొమ్మిదో వారం కావడం గమనార్హం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని