Whatsapp: వాట్సాప్‌లో వాటిని స్క్రీన్‌షాట్‌ తీసుకోలేరు

వాట్సాప్‌లో అవతలి వాళ్లు చూశాక, తెరమరుగయ్యే ‘వ్యూ వన్స్‌ మెసేజెస్‌’ను స్క్రీన్‌ షాట్‌ తీసుకోవడం ఇకపై కుదరకపోవచ్చు. అలా చేయడాన్ని బ్లాక్‌ చేసే సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు వాట్సాప్‌ మాతృసంస్థ మెటా వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌  తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రయోగాత్మక పరిశీలన జరుగుతుందని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు.

Updated : 10 Aug 2022 12:45 IST

‘వ్యూ వన్స్‌ మెసేజెస్‌’పై జుకర్‌బర్గ్‌
దిల్లీ

వాట్సాప్‌లో అవతలి వాళ్లు చూశాక, తెరమరుగయ్యే ‘వ్యూ వన్స్‌ మెసేజెస్‌’ను స్క్రీన్‌ షాట్‌ తీసుకోవడం ఇకపై కుదరకపోవచ్చు. అలా చేయడాన్ని బ్లాక్‌ చేసే సదుపాయాన్ని త్వరలోనే అందుబాటులోకి తేనున్నట్లు వాట్సాప్‌ మాతృసంస్థ మెటా వ్యవస్థాపకుడు, సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌  తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రయోగాత్మక పరిశీలన జరుగుతుందని, త్వరలోనే అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. ‘వ్యూ వన్స్‌ మెసేజెస్‌’లను స్క్రీన్‌షాట్‌ తీయకుండా నిరోధించే సదుపాయం వల్ల ‘ఇద్దరి మధ్య జరిగిన వాట్సాప్‌ చాట్‌’కు అదనపు భద్రత కల్పించినట్లు అవుతుందని జుకర్‌బర్గ్‌ వివరించారు. ఒక వ్యక్తి  తాను పంపిన మెసేజ్‌ అవతలి వ్యక్తి వాట్సాప్‌ చాట్‌లో శాశ్వతంగా ఉండిపోకూడదని భావించినప్పుడు, ‘వ్యూ వన్స్‌ మెసేజెస్‌’ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు. మనం పంపిన మెసేజ్‌ను అవతలి వ్యక్తి  చూడగానే, అది తెరమరుగువుతుంది. అయితే కొందరు మాత్రం ఇలాంటి మెసేజ్‌ను చూసేటప్పుడే, స్క్రీన్‌షాట్‌ తీసుకుంటున్నారు. అందువల్ల ఈ సదుపాయ ఉద్దేశం నెరవేరడం లేదు. అందుకే, అలాంటి మెసేజ్‌లను స్క్రీన్‌షాట్‌ తీయనివ్వకుండా చూసే సదుపాయాన్ని  వాట్సాప్‌ అందుబాటులోకి తెస్తోంది.

* ప్రస్తుతం ఒక గ్రూప్‌ నుంచి ఎవరైనా నిష్క్రమిస్తే, సభ్యులందరికీ తెలిసిపోతుంది. ఇకపై అడ్మిన్‌కు మాత్రమే తెలిసేలా, ఇతరులు ఎవరూ గుర్తించకుండానే గ్రూపు చాట్‌ నుంచి నిష్క్రమించే వీలు కలగనుంది.

* ఒక వ్యక్తి ఆన్‌లైన్‌లో ఉన్నట్లు ఎవరెవరికి తెలియాలనే విషయంలోనూ సొంతంగా నియంత్రించుకునే వీలునూ వాట్సాప్‌ కల్పించబోతోంది. ఈ కొత్త సదుపాయాలు ఈ నెల నుంచే క్రమంగా అందుబాటులోకి వస్తాయని సంస్థ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని