వెండి ఆకర్షణీయం!

పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం మరింత లాభపడే అవకాశం ఉంది. రూ.47,301 కంటే దిగువకు చేరితే మాత్రం బలహీనపడొచ్చు. సాంకేతికంగా రూ.47,388 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఇది కోల్పోతే రూ.46,998 వరకు పడిపోవచ్చు.

Published : 17 Jan 2022 01:52 IST

కమొడిటీస్‌ ఈ వారం

బంగారం

పసిడి ఫిబ్రవరి కాంట్రాక్టు ఈవారం మరింత లాభపడే అవకాశం ఉంది. రూ.47,301 కంటే దిగువకు చేరితే మాత్రం బలహీనపడొచ్చు. సాంకేతికంగా రూ.47,388 వద్ద మద్దతు కనిపిస్తోంది. ఇది కోల్పోతే రూ.46,998 వరకు పడిపోవచ్చు. ఒకవేళ పైకి వెళితే రూ.48,080, ఆ తర్వాత రూ.48,382 స్థాయిని పరీక్షించొచ్చు. ధర తగ్గినపుడల్లా కొనుగోలు చేయడం మంచి వ్యూహమవుతుంది.

* ఎంసీఎక్స్‌ బుల్‌డెక్స్‌ జనవరి కాంట్రాక్టు రూ.13,910 కంటే దిగువన కదలాడకుంటే.. రూ.14,159; రూ.14,266 వరకు రాణించొచ్చు..


వెండి ఫిబ్రవరి కాంట్రాక్టు రూ.60,469 ఎగువన ఉన్నంత వరకు సానుకూలంగానే కదలాడొచ్చు. ఈ వారం రూ.62,019 కంటే పైన కదలాడితే రూ.62,606; రూ.63,561 వరకు పెరగొచ్చు. దీర్ఘకాలానికి రూ.59881- 60,479 మధ్య లాంగ్‌ పొజిషన్లు తీసుకోవచ్చు.


ప్రాథమిక లోహాలు

* ఎంసీఎక్స్‌ మెటల్‌డెక్స్‌ ఫిబ్రవరి కాంట్రాక్టు రూ.17,301 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే మరింతగా పెరగొచ్చు.

రాగి జనవరి కాంట్రాక్టు రూ.730 దిగువన ముగిస్తే బలహీనపడే అవకాశం ఉంది. లేకుంటే కొనుగోళ్లకు మొగ్గుచూపొచ్చు.

* సీసం జనవరి కాంట్రాక్టు రూ.184.30 ఎగువన ట్రేడైనంత వరకు లాభాలు కొనసాగేందుకు అవకాశం ఉంది.

* జింక్‌ జనవరి కాంట్రాక్టు రూ.283.85 కంటే కిందకు వెళ్లకుంటే.. సానుకూల ధోరణిలో కదలాడొచ్చు. అందువల్ల స్టాప్‌లాస్‌ను సవరించుకుని రూ.292; రూ.294 లక్ష్యాలతో లాంగ్‌ పొజిషన్లు కొనసాగించవచ్చు. ఒకవేళ రూ.283 దిగువకు వస్తే షార్ట్‌ సెల్లింగ్‌ ఉత్తమం. ఇప్పటికే షార్ట్‌ సెల్‌ పొజిషన్లున్న ట్రేడర్లు రూ.291కి స్టాప్‌లాస్‌ను సవరించుకోవాలి.

అల్యూమినియం జనవరి కాంట్రాక్టు రూ.230.25 పైన కొనసాగినంత వరకు లాంగ్‌ పొజిషన్‌లు అట్టిపెట్టుకోవచ్చు. రూ.231 స్థాయికి వస్తే కొనుగోళ్లకు మొగ్గుచూపడం మంచిదే.

* నికెల్‌ జనవరి కాంట్రాక్టు రూ.1,641 కంటే ఎగువన ట్రేడయితే రూ.1674 వరకు పెరిగే అవకాశం ఉంది. రూ.1616కు తగ్గితే, రూ.1598 వరకు వెళ్లొచ్చు.


ఇంధన రంగం

* సహజవాయువు జనవరి కాంట్రాక్టుకు రూ.287 ఎగువన కొనుగోళ్లు కొనసాగొచ్చు. రూ.287 వద్ద మద్దతు, రూ.336 వద్ద నిరోధం ఎదురుకావొచ్చు. రూ.274 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.288- 301 మధ్య పొజిషన్లు తీసుకోవచ్చు.

* ముడి చమురు జనవరి కాంట్రాక్టు రూ.5,969 కంటే దిగువన ట్రేడ్‌ కాకుంటే మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ కిందకు వెళితే రూ.5892; రూ.5748 వరకు దిద్దుబాటు కావొచ్చు.


వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు ఏప్రిల్‌ కాంట్రాక్టు రూ.10,817 కంటే పైకి వెళ్లకుంటే రూ.10,011; రూ.9,758 వరకు దిగిరావచ్చు. ఒకవేళ పైకి వెళ్తే రూ.10,971 దగ్గర నిరోధం ఎదురుకావొచ్చు.

* జీలకర్ర ఏప్రిల్‌ కాంట్రాక్టు రూ.18,598 కంటే ఎగువన కదలాడకుంటే.. పడే అవకాశం ఉంది. అందువల్ల రూ.18,598 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.17,598 లక్ష్యంతో లాభాలు స్వీకరించొచ్చు.

* పత్తి జనవరి కాంట్రాక్టుకు రూ.36,990 వద్ద నిరోధం కనిపిస్తోంది. రూ.34,860 దిగువన అమ్మకాల ఒత్తిడి ఎదురుకావొచ్చు.  

- ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌


పసిడి దిగుమతులు రెండింతలు

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌- డిసెంబరు మధ్య దేశంలోకి దిగుమతి అయిన పసిడి విలువ 38 బిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.2.85 లక్షల కోట్లు)కు చేరింది. 2020 ఏప్రిల్‌- డిసెంబరు నాటి దిగుమతులు 16.78 బిలియన్‌ డాలర్లతో పోలిస్తే, ఈసారి రెట్టింపు కన్నా అధికమయ్యాయి. ఇదే సమయంలో వెండి దిగుమతులు 762 మి.డాలర్ల నుంచి 2 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ఫలితంగా వాణిజ్యలోటు 61.38 బి.డాలర్ల నుంచి 142.44 బి.డాలర్లకు పెరిగింది. డిసెంబరులో పసిడి దిగుమతులు 4.8 శాతం పెరిగి 4.5 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని