‘మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌’తో నాట్కో ఫార్మా ఒప్పందం

కొవిడ్‌-19 వ్యాధికి చికిత్సలో వినియోగించేందుకు ఇటీవల అత్యవసర అనుమతి పొందిన మోల్నుపిరవిర్‌ ఔషధాన్ని ఉత్పత్తి చేసి, విక్రయించడానికి నాట్కో ఫార్మా, స్విట్జర్లాండ్‌కు చెందిన మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌ (ఎంపీపీ)

Published : 21 Jan 2022 05:33 IST

మోల్నుపిరవిర్‌ ఉత్పత్తి, విక్రయానికి

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌-19 వ్యాధికి చికిత్సలో వినియోగించేందుకు ఇటీవల అత్యవసర అనుమతి పొందిన మోల్నుపిరవిర్‌ ఔషధాన్ని ఉత్పత్తి చేసి, విక్రయించడానికి నాట్కో ఫార్మా, స్విట్జర్లాండ్‌కు చెందిన మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌ (ఎంపీపీ) తో ‘లైసెన్సింగ్‌ ఒప్పందం’ కుదుర్చుకుంది. ఎంపీపీ, ఐక్యరాజ్యసమితి మద్దతు గల ప్రజారోగ్య సేవల సంస్థ. మోల్నుపిరవిర్‌ ఉత్పత్తి, విక్రయాలకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన ఫార్మా కంపెనీలతో ‘లైసెన్సింగ్‌ ఒప్పందాలు’ కుదుర్చుకోడానికి వీలుగా మోల్నుపిరవిర్‌ను అభివృద్ధి చేసిన యూఎస్‌ ఫార్మా సంస్థ మెర్క్‌తో ఎంపీపీ ఒక అవగాహనకు వచ్చింది. దీని ప్రకారం నాట్కో ఫార్మా, ఎంపీపీ తో ఒప్పందం చేసుకుంది. మోల్నుపిరవిర్‌ 200 ఎంజీ కేప్సూల్‌ను ఉత్పత్తి చేసి, దేశీయంగా ‘మోల్నున్యాట్‌’ అనే బ్రాండు పేరుతో విక్రయిస్తున్నట్లు నాట్కో ఫార్మా వెల్లడించింది. మోల్నుపిరవిర్‌ 200 ఎంజీ జనరిక్‌ ఔషధాన్ని ప్రపంచ వ్యాప్తంగా 105 దేశాలకు సరఫరా చేసే అవకాశం ఉన్నట్లు ఇలా కలిగినట్లు వివరించింది.  మోల్నుపిరవిర్‌కు మనదేశంలో భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) గత నెలలో అత్యవసర అనుమతి మంజూరు చేసింది. నాట్కో ఫార్మాతో సహా, 13 దేశీయ ఫార్మా కంపెనీలకు ఈ అనుమతి లభించింది.  

బయోఫోర్‌ ఇండియా కూడా...: మోల్నుపిరవిర్‌ మందు ఉత్పత్తి- విక్రయాల నిమిత్తం హైదరాబాద్‌కు చెందిన బయోఫోర్‌ ఇండియా ఫార్మాసూటికల్స్‌ కూడా మెడిసిన్స్‌ పేటెంట్‌ పూల్‌  నుంచి లైసెన్సింగ్‌ ఒప్పందం చేసుకుంది.  వారం రోజుల్లో దేశీయ మార్కెట్లో 40 మాత్రల ప్యాక్‌ను రూ.1500కు  విక్రయించడంతో పాటు, ఇతర దేశాలకు ఎగుమతి చేస్తామంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని