విద్యుత్‌ వాహనాల్లోకి అదానీ!

విమానాశ్రయాలు-పోర్టుల నిర్వహణతో పాటు గ్యాస్‌, విద్యుత్తు వంటి పలు రకాల వ్యాపారాలను నిర్వహిస్తున్న అదానీ గ్రూపు త్వరలోనే విద్యుత్‌ వాహన విభాగంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. తొలుత బస్సులు, ట్రక్కుల

Published : 22 Jan 2022 04:29 IST

తొలుత బస్సులు,ట్రక్కులతో

దిల్లీ: విమానాశ్రయాలు-పోర్టుల నిర్వహణతో పాటు గ్యాస్‌, విద్యుత్తు వంటి పలు రకాల వ్యాపారాలను నిర్వహిస్తున్న అదానీ గ్రూపు త్వరలోనే విద్యుత్‌ వాహన విభాగంలోకి అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. తొలుత బస్సులు, ట్రక్కుల తయారీతో ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది. తాము తయారు చేసిన వాహనాలను మొదట తమ విమానాశ్రయాలు, ఓడరేవులు, ఇతరత్రా రవాణా అవసరాల కోసమే వినియోగించే ఉద్దేశంలో అదానీ గ్రూపు ఉందని ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించింది. బ్యాటరీల తయారీ, దేశవ్యాప్తంగా ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు కూడా అదానీ గ్రూప్‌ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందని పేర్కొంది. పర్యావరణహిత ప్రాజెక్టుల్లో కీలక పాత్ర పోషించాలన్న ఉద్దేశంలో భాగంగానే, అదానీ గ్రూపు విద్యుత్తు వాహనాల (ఈవీ) తయారీలోకి ప్రవేశించనుందని చెబుతున్నారు. ఈవీల తయారీ కోసం ముంద్రాలోని ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లో పరిశోధన, అభివృద్ధి   (ఆర్‌అండ్‌డీ) కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసే ఉద్దేశంలో అదానీ గ్రూప్‌ ఉందట. దీనికి సంబంధించి ఓ ట్రేడ్‌మార్క్‌ను కూడా ఎస్‌.బి.అదానీ ఫ్యామిలీ ట్రస్టు ద్వారా రిజిస్టర్‌ చేసినట్లు సమాచారం.

పునరుత్పాదక విద్యుత్‌లో అగ్రస్థానమే లక్ష్యం..: రాబోయే దశాబ్దంలో కొత్త ఇంధన విభాగాల్లో 70 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.5,25,000 కోట్లు) వెచ్చించనున్నట్లు గతేడాది నవంబరులో అదానీ ప్రకటించారు. ఇందులో భాగంగానే అదానీ గ్రూపునకు చెందిన అదానీ గ్రీన్‌ ఓ అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని