TRAI: ఫోన్‌ చేసిన వారెవరో తెలిసిపోతుంది..!

ఎవరైనా ఫోన్‌ చేసినప్పుడు మొబైల్‌ తెర మీద వారి పేరు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు మన మొబైల్‌లో పేరు-నెంబరు

Updated : 21 May 2022 08:52 IST

మొబైల్‌ నెంబర్లకు కేవైసీ అనుసంధానం

దిల్లీ: ఎవరైనా ఫోన్‌ చేసినప్పుడు మొబైల్‌ తెర మీద వారి పేరు వచ్చేలా ఏర్పాట్లు చేయాలని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ఇప్పటివరకు మన మొబైల్‌లో పేరు-నెంబరు నిల్వ చేసుకుంటేనే, సదరు వ్యక్తులు ఫోన్‌ చేసినప్పుడు వారి పేరు మొబైల్‌ తెరపై కనపడుతుంది. ట్రాయ్‌ ప్రతిపాదన ప్రకారం, మనకు పరిచయం లేని వారు ఫోన్‌ చేసినా కూడా, వారి పేరు మనకు కనపడుతుంది. దీనికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు టెలికాం విభాగం (డాట్‌)తో ట్రాయ్‌ సమాలోచనలు నిర్వహించనుంది. త్వరలోనే ఇవి ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయని ట్రాయ్‌ ఛైర్మన్‌ పీడీ వాఘేలా తెలిపారు. ఈ ప్రతిపాదనపై తమతో పాటు టెలికాం విభాగమూ ఒకేరకంగా స్పందించినట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని